Health Tips: ఉదయం పూట మనం చేసే కొన్ని పనులు రోజంతా మానసిక స్థితి, శక్తి స్థాయిని ప్రభావితం చేస్తాయి. ఉదయాన్నే తెలియకుండా చేసే ఈ అలవాట్లు మనల్ని అలసిపోయేలా చేస్తాయి. అంతేకాదు, ఇవి మన శరీరం, ఆరోగ్య పై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఈ నేపథ్యంలో రోజంతా తాజాగా, శక్తివంతంగా ఉండటానికి నివారించాల్సిన కొన్ని అలవాట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ అలవాట్లను మార్చుకుంటే జీవితాన్ని మెరుగు పరుచుకోవచ్చు.
ఉదయాన్నే నిద్ర లేవడం మంచి అలవాటే కానీ, సరైన మార్గంలో అలవాటు అవ్వడం ముఖ్యం. రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా నిద్ర లేవడానికి ప్రయత్నిస్తే అది నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది శరీరాన్ని అలసిపోయేలా చేస్తుంది.
మనకు నిద్ర లేవగానే మొబైల్ చూడడం ఒక సాధారణ అలవాటుగా మారింది. ఇది మనల్ని రోజంతా అలసిపోయేలా చేస్తుంది. ఉదయాన్నే మొబైల్ వాడితే మన మానసిక శక్తి అలసిపోతుంది. దీనికి బదులుగా కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
మనలో చాలామందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగడం అలవాటు ఉంటుంది. వీటిని అధికంగా తీసుకుంటే తక్షణ శక్తి లభించినప్పటికీ, కొంత సమయం తర్వాత అది మనల్ని అలసిపోయినట్లు చేస్తుంది. టీ , కాఫీకి బదులుగా తాజా పండ్ల రసం, కొబ్బరినీరు వంటి సహజ శక్తి వనరులు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఎంతో మంచిది. ఇది శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది. కావున ఉదయాన్నే అల్పాహారాన్ని స్కిప్ చేయకూడదు. రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉండాలంటే అల్పాహారంలో పోషకాలను చేర్చడం ముఖ్యం. అల్పాహారంలో పండ్లు, ఓట్ మీల్, పెరుగు వంటివి చేర్చుకోవాలి. ఇవి రోజంతా మనల్ని తాజాగా ఉంచుతుంది.
ఉదయాన్నే వ్యాయామం చేయడం చాలా ప్రయోజనకరం. వ్యాయామం చేయడం వల్ల మన శరీరం చురుగ్గా ఉంటుంది. అంతేకాదు, ఇది ఈ రోజంతా శక్తిని అందిస్తుంది. అందువల్ల ప్రతిరోజు కొన్ని నిమిషాలు పాటు యోగ లేదా తేలికపాటి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


