Height Increase Superfoods: పిల్లల విషయాల్లో తల్లిదండ్రులను ఎక్కువగా ఆందోళనకు గురి చేసే ఏంటంటే పిల్లలు ఎత్తు పెరగకపోవడం. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే పిల్లలు సరిగ్గా ఎత్తు పెరగడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా, కొందరు పిల్లలు త్వరగా ఎత్తు పెరిగితే, మరికొందరి పిల్లలకు కాస్త సమయం పడుతుంది. పిల్లల ఆహారంలో పోషకాలు లేకపోవడం దీనికి కారణం అని చాలా మంది భావిస్తారు. దీనికోసం చాలా మంది పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు హైట్ పెరగడానికి అనేక చర్యలు తీసుకుంటారు. అయినప్పటికీ, తమ పిల్లల ఎత్తు విషయంలో ఎలాంటి ఫలితం ఉండదు. కొన్నిసార్లు ఈ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభవిస్తుంది. అందువల్ల పిల్లలు, టీనేజర్లు హైట్ పెరగడానికి తీసుకునే ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే, ఇప్పుడు ఎత్తును పెంచడంలో సహాయపడే కొన్ని ఆహారాల గురించి ఈ కధనం ద్వారా తెలుసుకుందాం.
పాలు
పిల్లల ఎత్తును పెంచడంలో పాలు ఎంతో సహాయపడుతాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా, ఎత్తు కూడా పెంచుతుంది.
ఆకుకూరలు
పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర వంటి కూరగాయలు పిల్లల ఎత్తును పెంచడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలో ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా పిల్లల హైట్ ను పెంచుతాయి.
Also Read:Liver Health:కళ్లు, చేతులు, పాదాలలో ఈ లక్షణాలు ఉన్నాయా..అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్లే!
గుడ్లు
గుడ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చెప్పాల్సిన పని లేదు. గుడ్లు పిల్లల ఎత్తు పెరగడంలో ఎంతో సహాయపడుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు. గుడ్లలో అధిక నాణ్యత గల ప్రోటీన్, విటమిన్ బి12, విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదల, ఎముక అభివృద్ధికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
సోయా, టోఫు
గుడ్లు తినడానికి ఇష్టపడని పిల్లలకు ఆహారంలో సోయా, టోఫు కూడా భాగం చేయాలి. ఈ రెండిట్లో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి పిల్లల కండరాలను బలంగా చేయడమే కాకుండా ఎత్తును సైతం పెంచడంలో సహాయపడతాయి.
డ్రై ఫ్రూట్స్
బాదం, వాల్ నట్స్ అవిసె గింజలు వండి విత్తనాలు కచ్చితంగా పిల్లల డైట్ లో చేర్చాలి. ఇందులో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జింక్, కాల్షియం వంటి అంశాలు పిల్లల హైట్ పెరగడంలో ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తాయి.


