Monday, July 14, 2025
Homeలైఫ్ స్టైల్Fenugreek Seeds Water: నానబెట్టిన మెంతి నీటిని తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా..?

Fenugreek Seeds Water: నానబెట్టిన మెంతి నీటిని తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా..?

Fenugreek Seeds Water Benefits: మెంతులు ప్రతి ఇంట్లో వంటలలో ఉపయోగిస్తారు. మెంతులను ఆయుర్వేదంలో శక్తివంతమైన మూలికగా పరిగణిస్తారు. ఇందులో అనేక ఔషధ గుణాలు నిండి ఉంటాయి. మెంతులు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నీరు తీసుకుంటే మన శరీరంలో అనేక మార్పులను చూస్తాం. దీంతోపాటు అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే, మెంతి నీటి ప్రయోజనాలను పూర్తిగా పొందడానికి మెంతుల నీటిని సరైన మార్గంలో, సరైన పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఇప్పుడు ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో మెంతి నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురుంచి తెలుసుకుందాం.


మెంతి నీటి ఆరోగ్య ప్రయోజనాలు

మెంతులలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఈ మెంతుల నీటిని రోజూ మెంతి నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అంతేకాకుండా ఇది మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది.

ఈ నీరు రక్తంలో షుగర్ ను నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే మెంతి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. వీటిని మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

మెంతి నీరు జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించి కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా అనవసరమైన ఆహారాలు తినకుండా ఉంటాం.

మెంతి మీరు జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది నెత్తికి పోషణ ఇస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెంతి నీరు మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


మెంతి నీటిని తీసుకునే సరైన మార్గం

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ మెంతి నీటిని చేయడానికి 1-2 టీస్పూన్ల మెంతి గింజలను తీసుకోవాలి. వాటిని 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయానే ఈ నీటిని ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. దీంతోపాటు నానబెట్టిన గింజలను కూడా నమలవచ్చు. ఎందుకంటే మెంతులలో ఫైబర్‌లో పుష్కలంగా ఉంటుంది. రుచి కోసం ఈ నీటిలో నిమ్మరసం లేదా తేనెను జోడించవచ్చు. అయితే, ప్రతిరోజూ 1 గ్లాసు కంటే ఎక్కువ తాగకూడదు. ఎందుకంటే దీని అధికంగా తీసుకుంటే కడుపు చికాకు లేదా విరేచనాలు వస్తాయి.


జాగ్రత్తలు

మెంతి నీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, ఇప్పటికే మాత్రలు తీసుకునే వ్యక్తులు ముందుగా వైద్యుడిని సంప్రదించి మెంతి నీరు తాగాలి. కడుపు నొప్పి, విరేచనాలు లేదా తలతిరగడం వంటి లక్షణాలు ఉంటె దీనిని తీసుకోవడం మానేయాలి. డయాబెటిస్ మందులు వాడేవారు దీనిని తమ ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News