Sunday, July 13, 2025
Homeలైఫ్ స్టైల్Health Drinks: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే పండ్ల రసాలు..

Health Drinks: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే పండ్ల రసాలు..



Health Drinks: వర్షాకాలం ప్రారంభమైంది. ఆరోగ్యం పట్ల రెట్టింపు శ్రద్ధ వహించాలి. వర్షాకాలంలో ఎన్నో వ్యాధుల వస్తాయి. అనేక రకాల వైరస్‌లు, ఇన్ఫెక్షన్‌ల ప్రమాదం ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం. శరీరం రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఏదైనా వ్యాధి సులభంగా సోకుతుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో అనేక పోషకాలు సమృద్ధిగా ఉండేటట్లు చూసుకోవాలి. దీంతో అనేక వ్యాధులను ఎదుర్కోవచ్చు. అయితే, ఇప్పుడు వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచడానికి ఎలాంటి పండ్ల జ్యూస్ లు తీసుకోవాలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఇవి అనేక రకాల కాలానుగుణ వ్యాధుల నుండి రక్షిస్తాయి.


కివి జ్యూస్

కివి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మంచి మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది అనేక రకాల వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. అయితే, వర్షాకాలంలో కివి జ్యూస్ తాగడం వల్ల ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. అంతేకాకుండా కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. కివి పండు జ్యూస్ డెంగ్యూ, ఉబ్బసం వంటి వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారు దీని తాగొచ్చు. రక్తంలో షుగర్ లెవెల్స్ ని కూడా అదుపులో ఉంచుతుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

చెర్రీ జ్యూస్

వర్షాకాలంలో చెర్రీ రసం కూడా తాగవచ్చు. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో పాటు.. ఇది విటమిన్లు A, B, C, పొటాషియం మంచి మూలం. ఇది రోగనిరోధక శక్తికి ప్రయోజనకరంగా ఉంటుంది. నిద్ర పట్టనివారు ఈ చెర్రీ జ్యూస్ ను తాగితే హాయిగా నిద్ర పోతారు.

క్యారెట్, బీట్‌రూట్, ఆపిల్ జ్యూస్

కాలంతో సంబంధం లేకుండా దొరికే క్యారెట్, బీట్ రూట్, ఆపిల్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. క్యారెట్, బీట్‌రూట్, ఆపిల్ జ్యూస్ ని ABC జ్యూస్ అని అంటారు. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు A, C, B6 లోపాన్ని కూడా తీరుస్తాయి.అంతేకూండా ఇది వైరల్, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News