Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Winter Fruits: చలికాలంలో ఈ పండ్లు తింటే చర్మ సౌందర్యం రెట్టింపు!

Winter Fruits: చలికాలంలో ఈ పండ్లు తింటే చర్మ సౌందర్యం రెట్టింపు!

Winter Fruits For Skin: చలికాలం అనేక సమస్యలను తీసుకువస్తుంది. ఈ సమయంలో మనల్ని మనం వెచ్చగా ఉంచడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండేలా చూసుకోవాలి. ఈ సీజన్‌లో అనేక చర్మ సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారడం, దురద, పగుళ్లు వంటివి సర్వ సాధారణం. అయితే, శీతాకాలంలో కూడా చర్మాన్ని మెరుస్తూ ఉండాలంటే, ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోవాలి. ఈ పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, నీరు చర్మాన్ని లోపల నుండి హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇప్పుడు చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి సహాయపడే 5 పండ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

నారింజ: చలికాలంలో చర్మం పొడిబారకుండా, నీరసంగా ఉండకూడదంటే డైట్ లో నారింజలు ఉండేలా చూసుకోవాలి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని దృఢంగా, యవ్వనంగా ఉంచుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్, కాలుష్యం వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

దానిమ్మ: దానిమ్మపండు చలికాలంలో చర్మానికి ఒక వరం. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తాయి. దెబ్బతిన్న చర్మ కణాలను బాగు చేస్తాయి. క్రమం తప్పకుండ దీని తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ముఖం సహజంగా గులాబీ రంగులో, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

also read:Mango leaves Tea: పండ్లతోనే కాదు.. మామిడి ఆకులతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..ఇలా వాడితే ఆ వ్యాధులన్నీ పరుగో పరుగు..!!

బొప్పాయి: బొప్పాయి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడానికి అద్భుతమైనది. ఇందులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. ఇందులో విటమిన్లు ఎ, సి మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని రిపేర్ చేసి తేమ చేస్తుంది.

ఆమ్లా: ఉసిరి విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని దృఢంగా, ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుతుంది. ఇది శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది. ముఖంపై మొటిమలు, నీరసాన్ని తగ్గిస్తుంది. దీన్ని పచ్చిగా తినవచ్చు లేదా దీని రసం త్రాగవచ్చు. ఊరగాయ రూపంలో కూడా తినవచ్చు.

బ్లూబెర్రీస్: బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇది చర్మంపై ఎరుపు, ఉబ్బరం, నీరసాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ బ్లూబెర్రీస్ తినడం వల్ల చర్మ రంగు మెరుగుపడుతుంది. ముఖం యవ్వనంగా, అందంగా కనిపిస్తుంది.

అలాగే, చలికాలంలో మెరిసే చర్మం కావాలంటే, దానిని హైడ్రేటెడ్‌గా ఉంచడం ముఖ్యం. కావున పుష్కలంగా నీరు త్రాగాలి. టీ, కాఫీ, స్వీట్లు అధికంగా తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి చర్మాన్ని పొడిబారిస్తాయి. శరీరానికి అనేక పోషకాలను అందించడానికి సలాడ్‌లు లేదా స్మూతీలలో కలిపిన పండ్లను డైట్ లో ఉండేలా చూసుకోవాలి. తేలికపాటి సహజ స్క్రబ్ లేదా ఫేస్ ప్యాక్‌ను ముఖానికి వారానికి 1-2 సార్లు అప్లై చేయాలి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad