Weight Loss Tea: నేటి కాలంలో చాలామంది ఉబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీనికి అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలు. ఊబకాయం ఎంత సులభంగా పెరుగుతుందో, దానిని తగ్గించడం కూడా అంత కష్టం. చాలామంది ఊబకాయాన్ని తగ్గించడానికి జిమ్ కు వెళ్లి గంటలు తరబడి చెమట తీస్తారు. కానీ ఆశించినంత ఫలితాలు రాకుండా ఉంటాయి. ఊబగాయాన్ని తగ్గించడానికి కేవలం జిమ్ కు వెళ్లడమే కాదు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అప్పుడే సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ నేపథ్యంలో జపనీస్ టెక్నిక్ బరువు తగ్గడానికి ప్రయోజనం కరంగా ఉంటుందని తెలుసా? అవును కొన్ని జపానీస్ పానీయాలు తాగడం వల్ల బొడ్డు తగ్గడంలో చాలా సహాయపడుతాయి. అవేంటో ఇప్పుడు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
గ్రీన్ టీ
మంచి ఆరోగ్యం కోసం చాలామంది ప్రతిరోజూ గ్రీన్ టీ ని తాగుతుంటారు. ఇది జీవక్రియను పెంచడానికి పనిచేస్తుంది. ఇందులో ఉండే కాటేచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతాయి. రోజుకు రెండు నుండి మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు వాపు, ఉబ్బరం సమస్య కూడా తగ్గుతుంది.
Also Read: Carrot for health: ఆరోగ్యానికి క్యారెట్ చేసే మేలు తెలుసా..?
మచ్చా
ఇటీవల కాలంలో చాలామంది మచ్చా టీ తాగడానికి ముగ్గు చూపుతున్నారు. దీన్ని మెత్తగా రుబ్బిన గ్రీన్ టీ ఆకుల నుండి తయారు చేస్తారు. కావున, ఇందులో సాధారణ గ్రీన్ టీ కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ జీవక్రియను వేగవంతం చేస్తాయి. దీన్ని తాగడం వల్ల కెలరీలను వేగంగా బర్న్ అవుతాయి. ఉదయాన్నే ఒక కప్పు మచ్చా టీ తాగడం ద్వారా అనేక లాభాలు పొందవచ్చు.
బార్లీ టీ
జపాన్ లో అన్నిటికంటే ఎక్కువగా తీసుకునే టీ లలో బార్లీ టీ ఒకటి. ఇందులో కేఫిన్ ఉండదు. దీని రుచి తేలికపాటి కాల్చిన బార్లీ లాగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరం హైడ్రేటుగా ఉంటుంది. రోజుకు ఒక కప్పు బార్లీ టీ తాగితే త్వరగా బరువు తగ్గవచ్చు.
పీసో టి
ఈ టీ పీసో ఆకుల నుండి తయారవుతుంది. దీనిలో మంచి మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీరాన్ని నిర్వీకరణ చేస్తుంది. దీన్ని తాగడం వల్ల కడుపు చాలా సమయం పాటు నిండుగ ఉన్న భావన కలుగుతుంది. దీంతో పదేపదే తినే అలవాటును నివారించవచ్చు.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


