Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Lung Health: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Lung Health: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Lung Health Tips: మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఊపిరితిత్తులు ఒకటి. ఇవి శ్వాస ద్వారా ఆక్సిజన్‌ను తీసుకొని, కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంపిస్తాయి. అయితే నేటి బిజీ లైఫ్, పెరుగుతున్న కాలుష్యం, అనారోగ్యకరమైన అలవాట్లు ఊపిరితిత్తుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. నిరంతర దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఊపిరితిత్తులు బలహీనపడతాయని అర్థం. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సకాలంలో జాగ్రత్తగా చూసుకోకపోతే ఆస్తమా, బ్రోన్కైటిస్, ఊపిరితిత్తుల సంకోచం వంటి తీవ్రమైన వ్యాధులు సంభవించవచ్చు. అయితే, కొన్ని సులభమైన ఇంటి నివారణలు, జీవనశైలి మార్పులు చేయడం ద్వారా, ఊపిరితిత్తులను మళ్ళీ బలోపేతం చేయవచ్చు. ఇప్పుడు ఊపిరితిత్తులు బలహీనపడటానికి గల కారణాలు, వాటిని ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

ఊపిరితిత్తులు బలహీనపడటానికి కారణాలు

ధూమపానం:
సిగరెట్ లేదా బీడీ వినియోగం ఊపిరితిత్తుల పనితీరును త్వరగా తగ్గిస్తుంది. అంతేకాకుండా కణాలను దెబ్బతీస్తుంది.

కలుషితమైన గాలి
ప్రతిరోజూ దుమ్ము, పొగ లేదా వాహన పొగ కారణంగా కూడా ఊపిరితిత్తులు బలహీనపడుతాయి.

శారీరక శ్రమ లేకపోవడం:
వ్యాయామం లేకపోవడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. దీంతో ఊపిరితిత్తులు బలపడతాయి.

అనారోగ్యకరమైన ఆహారం
విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్ లేకపోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు తగ్గుతుంది. దీంతో ఈ పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

నిద్ర లేకపోవడం:
తగ్గినంత నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తిని బలహీనపడుతుంది. దీని కారణంగానే ఊపిరితిత్తులు త్వరగా ప్రభావితమవుతాయి.

 

Also read: Poha Or Upma: పోహా vs ఉప్మా..బరువు తగ్గడానికి ఏది బెటర్​?

ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి మార్గాలు

శ్వాస వ్యాయామాలు:
ప్రాణాయామం, అనులోమ-విలోమ, కపల్‌భతి వంటి యోగా కార్యకలాపాలు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం చేయాలి. ఈ శ్వాస వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి.

ధూమపానం:
ధూమపానం లేదా మధ్యపానం అలవాటు ఉంటె వెంటనే మానేయాలి. ఇది ఊపిరితిత్తులను నిర్విషీకరణ చేయడానికి మొదటి అడుగు.

ఆవిరి పీల్చడం:
వారానికి 2-3 సార్లు ఆవిరి పీల్చడం వల్ల శ్లేష్మం తొలగిపోతుంది. దీంతో శ్వాస సులభతరం అవుతుంది.

యాంటీఆక్సిడెంట్లు ఉండే ఆహారాలు:
ఆమ్లా, నిమ్మ, పసుపు, అల్లం, గ్రీన్ టీ ఊపిరితిత్తులను ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

వాకింగ్:
ప్రతి ఉదయం లేదా సాయంత్రం స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రదేశంలో నడవాలి. దీని వల్ల ఊపిరితిత్తులకు మెరుగైన ఆక్సిజన్ లభిస్తుంది.

 

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad