Saturday, November 15, 2025
HomeTop StoriesBad Cholesterol: ఈ సూపర్ సీడ్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గుతుందట! మరి మీ...

Bad Cholesterol: ఈ సూపర్ సీడ్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గుతుందట! మరి మీ డైట్ లో ఉన్నాయా..?

Seeds For Bad Cholesterol: మనం తీసుకునే ఆహారాల వల్ల శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంటాయి. మంచి కొవ్వు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తే, చెడు కొలెస్ట్రాల్ వల్ల అర్థరైటిస్, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. ఇందుకోసం కొన్ని ఆహార పదార్థాలను రోజూవారీ ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

అవిసె గింజలు: అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల అద్భుతమైన మూలం. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచి. వాపును తగ్గించే ఆరోగ్యకరమైన కొవ్వులు. వీటిలో కరిగే ఫైబర్, లిగ్నాన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఫైబర్‌లు కడుపులో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL)తో బంధించి శరీరం నుండి తొలగిస్తుంది. వీటిని తేలికగా వేయించి, పౌడర్‌గా చేసుకోవాలి. పెరుగు, ఓట్ మీల్ లేదా స్మూతీస్‌లో జోడించి ప్రతిరోజూ 1-2 టీస్పూన్లు తీసుకోవచ్చు.

చియా సీడ్స్: చియా సీడ్స్ అనేక పోషకాలతో నిండి ఉంటాయి.అందుకే వీటిని “సూపర్ ఫుడ్” గా పరిగణిస్తారు. వీటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చియా విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు (ALA) కూడా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. 1 టీస్పూన్ చియా విత్తనాలను ఒక గ్లాసు నీరు లేదా పాలలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం అనేక ఆహార రూపంలో తినవచ్చు.

also read:Kidney Health: జాగ్రత్త..ఈ డ్రింక్స్​తో కిడ్నీలకు ముప్పు..

గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజలు మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటాయి. ఈ రెండూ గుండె ఆరోగ్యానికి కీలకమైనవి. మెగ్నీషియం కంటెంట్ సాధారణ హృదయ స్పందనను నిర్వహించడానికి, రక్త నాళాలను సడలించడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలను చిరుతిండిగా తినవచ్చు లేదా సలాడ్లు, సూప్‌లలో జోడించి తినవచ్చు.

పొద్దుతిరుగుడు విత్తనాలు: పొద్దుతిరుగుడు విత్తనాలు విటమిన్ E అద్భుతమైన మూలం. విటమిన్ E అనేది ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఈ విటమిన్ కణాలను దెబ్బతినకుండా రక్షిస్తుంది. ధమనులలో కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడుతుంది. వాటిలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. వీటిని తేలికగా వేయించి నేరుగా తినవచ్చు.

నువ్వులు: తెలుపు, నలుపు నువ్వులు లిగ్నన్స్, ఫైటోస్టెరాల్స్ వంటి ఎంజైమ్‌లతో సమృద్ధిగా ఉంటాయి. ఈ చిన్న విత్తనాలు మన శరీరంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది. నువ్వులను వేయించి చట్నీల రూపంలో తినవచ్చు.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad