Children Height Increase Vegetables: పిల్లల విషయాల్లో తల్లిదండ్రులను ఎక్కువగా ఆందోళనకు గురి చేసే విషయం ఏంటంటే? పిల్లలు ఎత్తు పెరగకపోవడం. దీనికి తల్లిదండ్రుల జీన్స్ ఒక్కటే కారణం అనుకుంటే పొరపాటేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం వంటివీ కూడా చిన్నారుల ఎత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
అందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, ఎత్తుకు తగ్గ బరువుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఏదైనా కారణం చేత పిల్లల ఎత్తు వారి తోటివారి కంటే చాలా తక్కువగా ఉంటె పిల్లలు హైట్ పెరగడానికి అనేక చర్యలు తీసుకుంటారు. అయినప్పటికీ, తమ పిల్లల ఎత్తు విషయంలో ఎలాంటి ఫలితం ఉండదు. ఈ క్రమంలోనే పిల్లలు ఎత్తు పెరగడానికి కొన్ని కూరగాయలు దోహదపడుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర: పాలకూరలో కాల్షియం, ఐరన్, విటమిన్లు A, C పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది పిల్లల శరీరాన్ని మొత్తం అభివృద్ధిని ప్రోత్సహించడానికి సహాయపడతాయి. దీని పిల్లలకు సూప్, కూరగాయలు లేదా స్మూతీలో దీన్ని చేర్చవచ్చు.
క్యారెట్లు: క్యారెట్ పిల్లలకు సలాడ్, జ్యూస్ లేదా కూరగాయల రూపంలో ఇవ్వవచ్చు. ఇందులో ఎముకల అభివృద్ధికి అవసరమయ్యే విటమిన్ A, బీటా-కెరోటిన్ ఉంటాయి. క్యారెట్లు పిల్లలలో పెరుగుదల హార్మోన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.
బ్రోకలీ: బ్రోకలీలో విటమిన్లు సి, కె, కాల్షియం ఉంటాయి, ఇవి పిల్లల రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలను బలోపేతం చేస్తాయి. వీటిని ఆవిరి మీద ఉడికించడం ద్వారా లేదా సూప్‌లో జోడించడం ద్వారా పిల్లలకు తినిపించవచ్చు.
బఠానీలు: పచ్చి బఠానీలు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. ఇవి కండరాల కదలికలు, ఎముకల అభివృద్ధికి సహాయపడతాయి. వీటిని కూరగాయలు లేదా పరాఠాలలో కలిపి పిల్లలకు ఇవ్వవచ్చు.
చిలగడదుంపలు: వీటిని ఉడకబెట్టడం ద్వారా తినవచ్చు. చిలగడదుంపలలో విటమిన్లు ఎ, సి, ఫైబర్ ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


