Weight Loss: బెల్లి ఫ్యాట్ శరీర రూపాన్ని మార్చడమే కాకుండా, అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈరోజుల్లో చాలామంది బెల్లి ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న, పెద్ద ఇలా వయసుతో సంబంధం లేకుండా దీని బారినపడుతున్నారు. దీనికి నేటి జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలు. బెల్లి ఫ్యాట్ పెరగడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి అనేక తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కావున, ఈ సమస్యను నివారించడం చాలా అవసరం. బెల్లి ఫ్యాట్ తో ఇబ్బంది పడుతుంటే, దాని తగ్గించడానికి కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. ఈ సహజమైన పద్ధతులు అనుసరించడం ద్వారా బెల్లి ఫ్యాట్ ను సులభంగా తగ్గించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. తీసుకునే ఆహారం
బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపాలి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే? ఎంత వ్యాయామం చేసినా తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోతే, బెల్లి ఫ్యాట్ తగ్గించడం చాలా కష్టం అవుతుంది.
ప్రోటీన్ ఆహారాలు: ఆహారంలో ప్రోటీన్ ఆహారాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగానే కడుపు ఎక్కువ సమయం నిండిన భావన కలుగుతుంది. ఇది పదే పదే తినే అలవాటును నిరోధిస్తుంది. పప్పుధాన్యాలు, గుడ్లు, చికెన్, చేపలు, చీజ్, పెరుగు, సోయాబీన్స్ వంటి ఆహారాలను తీసుకోవాలి.
ఫైబర్ చాలా అవసరం: బెల్లి ఫ్యాట్ తగ్గించడంలో డైట్ లో ఫైబర్ ఉండాలి. ఆకుకూరలు, తాజా పండ్లు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఫైబర్ సరైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను నివారించడం: చక్కెర, శుద్ధి చేసిన పిండి ఆహారాలు బెల్లి ఫ్యాట్ కు ప్రధాన కారణాలు. శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, స్వీట్లు, కేకులు, వైట్ తెల్ల బ్రెడ్, సమోసాలు, కచోరీలకు దూరంగా ఉండాలి.
నీళ్ళు పుష్కలంగా త్రాగండి : రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగే అలవాటు చేసుకోవాలి. నీరు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. జీవక్రియను పెంచుతుంది. బెల్లి ఫ్యాట్ తగ్గేందుకు గోరువెచ్చని నీరు, జీలకర్ర నీరు ప్రయోజనకరంగా ఉంటాయి.
also read:Milk: పడుకునే ముందు 1 గ్లాసు పాలు తాగితే చాలు..ఈ సమస్యలన్నీ పరార్!
2. వ్యాయామం అవసరం
బెల్లి ఫ్యాట్ తగ్గించడంలో కేవలం ఆహార విషయంలో జాగ్రత్త పడితే సరిపోదు. తరచుగా వ్యాయామాలు చేయడం కూడా ఎంతో అవసరం.
కార్డియో: కార్డియో వ్యాయామాలు హృదయ స్పందన రేటును పెంచుతాయి. కేలరీలను సులభంగా బర్న్ చేస్తాయి. ప్రతిరోజూ కనీసం 30-45 నిమిషాల కార్డియో వ్యాయామాలు చేయాలి. చురుకైన నడక, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్కిప్ప్పింగ్ మొదలైనవి గొప్ప ఎంపికలు.
స్ట్రెంత్ ట్రైనింగ్: కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా అవసరం. ఇది కండరాలను బలపరుస్తుంది. శరీరం విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. పుష్-అప్స్, స్క్వాట్స్, ప్లాంక్‌లు, డంబెల్ వ్యాయామాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
3. ఒత్తిడిని తగ్గించి తగినంత నిద్ర
చాలామంది బెల్లి ఫ్యాట్ తగ్గించడంలో ఈ అంశాన్ని పట్టించుకోరు. కానీ, ఒత్తిడి, నిద్ర లేకపోవడం కూడా బెల్లి ఫ్యాట్ పెరగడానికి ప్రధాన కారణం.
ఒత్తిడి: శరీరం ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టిసాల్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ శరీరం బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం, చేయాలి లేదా అభిరుచులకు సమయం కేటాయించాలి.
తగినంత నిద్ర: ప్రతిరోజూ 7-8 గంటల నాణ్యమైన నిద్ర పోవడం చాలా ముఖ్యం. నిద్ర లేకపోతే, కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఆకలిని నియంత్రించే హార్మోన్లను అసమతుల్యత చేస్తుంది. జంక్ ఫుడ్ తినడానికి దారితీస్తుంది.


