Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్పిల్లల ప్రవర్తనతో ఒత్తిడిగా అనిపిస్తుందా..? అయితే ఈ టిప్స్ మీకోసమే..!

పిల్లల ప్రవర్తనతో ఒత్తిడిగా అనిపిస్తుందా..? అయితే ఈ టిప్స్ మీకోసమే..!

పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రుల జీవితంలోనే పెద్ద సవాలుగా మారుతుంది. పుట్టినప్పటి నుంచి పాలు పట్టించడంలోనే కాదు, పిల్లలు నడవడం, మాట్లాడడం మొదలయ్యాక వారి ప్రవర్తనను నిర్వహించడంలోనూ పేరెంట్స్‌కి ఎంతో కష్టమైన పని.. చిన్న పిల్లలు మాట్లాడలేని వయస్సులో తాము ఫీలయ్యే భౌతిక, మానసిక అవసరాలను వ్యక్తపరచలేరు. వాళ్లు బాధపడితే ఏడుస్తారు, ఇబ్బంది పడితే కోపంగా ప్రవర్తిస్తారు. అలాంటి ప్రవర్తన తల్లిదండ్రులకి నానాటికీ ఒత్తిడిగా అనిపించవచ్చు.

- Advertisement -

పిల్లల ప్రవర్తనతో ఇబ్బంది పడుతున్నప్పుడు, తల్లిదండ్రులు ఇతర పేరెంట్స్‌కి తమ అనుభవాలు చెప్పుకోవచ్చు. అదే సమస్యలు వేరే వాళ్లకి కూడా ఎదురవుతున్నాయని తెలిసినప్పుడు ఒత్తిడి తక్కువవుతుంది. పేరెంటింగ్ గురుపులు, ఆన్‌లైన్ ఫోరమ్‌లు, ఫేస్ టు ఫేస్ చర్చలు మంచి ఉపశమనం కలిగించగలవు. అలాగే తల్లిదండ్రులు డీప్ బ్రీతింగ్, ధ్యానం, వాకింగ్ లేదా జర్నల్ రాయడం వంటివి చేస్తే మనసు కాస్త రిలీఫ్ అవుతుంది. కొన్నిసార్లు పేరెంటింగ్ వర్క్‌షాపుల్లో పాల్గొంటే పిల్లల బిహేవియర్ పట్ల మంచి అవగాహన ఏర్పడుతుంది.

పిల్లలకు ఒక స్థిరమైన డైలీ రొటీన్ ఇవ్వడం వల్ల వారు ఏం జరుగుతుందో ముందే ఊహించగలుగుతారు. భోజనం, నిద్ర, ఆటకి టైమింగ్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు పిల్లలు నమ్మకంగా, క్రమంగా ప్రవర్తిస్తారు. ఆకలి లేదా నిద్ర లేకపోవడం వల్లే చాలా సార్లు పిల్లలు వేధిస్తుంటారు. ఆ సమయంలో వారిపై అరవకుండా, నిదానంగా స్పందించడం మంచిది. వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు వారిని పొగడటం వల్ల వాళ్లలో పాజిటివ్ బిహేవియర్ పెరుగుతుంది.

చిన్నారులకు కొన్ని ఎంపికలు ఇవ్వడం వల్ల వారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకునే అలవాటు పెరుగుతుంది. బ్లూ షూ వేసుకోవాలా, రెడ్ షూ వేసుకోవాలా అన్నట్లుగా అడిగితే వారు తమకు కావాల్సినది ఎంచుకుంటారు. తమ ఆలోచనలకు విలువ ఇస్తున్నామనే భావన వాళ్లలో కోపాన్ని తగ్గించగలదు.

తల్లిదండ్రులు తమనే పిల్లలు ఫాలో అవుతారు. పేరెంట్స్ కోపంగా ఉన్నప్పుడు కూడా తమ భావోద్వేగాలను ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది చిన్నారులు గమనిస్తారు. అందుకే, “నాకు కోపం వచ్చింది, కాబట్టి నేను నిశ్శబ్దంగా ఉన్నాను,” “డీప్ బ్రీతింగ్ చేస్తున్నాను” అని చెప్పడం వల్ల పిల్లలు కూడా అలా నేర్చుకుంటారు. పిల్లల ప్రవర్తన మార్చడం అనేది ఒక్కరోజులో జరగదు. ఓపికతో, ప్రేమతో ముందుకెళ్లాలి. ఒకవేళ తల్లిదండ్రులు ఈ సమస్యలు తాము తట్టుకోలేకపోతున్నామనుకుంటే, ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ తీసుకోవడంలో తప్పులేదు. ఇలా ముందడుగు వేస్తే పిల్లలతో పాటు తల్లిదండ్రుల మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad