Health Tips: ఇంట్లో చెప్పులు ధరించాలా.. వద్దా.. అనే ప్రశ్న చాలా మందిని గందరగోళానికి గురిచేస్తుంది. ఇది కేవలం సౌకర్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఆరోగ్యం, పరిశుభ్రత మరియు సంప్రదాయాలతో సైతం ముడిపడి ఉంది. నివాస వాతావరణం అలాగే మన జీవనశైలికి తగ్గ అలవాట్లను బట్టి.. చెప్పులు వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. అయితే ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం!
ఇంట్లో చెప్పులు ధరించడం వల్ల ప్రయోజనాలు:
పరిశుభ్రత: బయటి నుంచి వచ్చే దుమ్ము, మట్టిని ఇంట్లోకి రాకుండా నివారించడానికి ఇంట్లో చెప్పులు వేసుకోవడం ఒక మంచి మార్గం. దీనివల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది. అంతే కాకుండా సౌకర్యంగాను ఉంటుంది.
పాదాలకు రక్షణ: ఇంట్లో అప్పుడప్పుడూ మనకు తెలియకుండానే గాజు ముక్కలు, మేకులు కింద పడే అవకాశం ఉంటుంది. అవేకాక ఇతర పదునైన వస్తువులు సైతం మన పాదాలకు హాని చేసే అవకాశం పోలేదు. అందుకే చెప్పులు వేసుకోవడం ద్వారా వాటి నుంచి పాదాలకు రక్షణ లభిస్తుంది.
ఆరోగ్యపరమైన లాభాలు: మధుమేహం ఉన్నవారు లేదా పాదాలకు సంబంధించిన కీళ్ల నొప్పులు ఉన్నవారు చెప్పులు వేసుకుంటే.. పాదాలకు అవసరమైన ఆధారం లభిస్తుంది. దీంతో నొప్పుల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది.
Also Read:https://teluguprabha.net/lifestyle/natural-tips-to-get-rid-of-rats/
చెప్పులు ధరించకపోవడం వల్ల ప్రయోజనాలు:
మెరుగైన ఆరోగ్యం: చెప్పులు లేకుండా నేలపై నడవడం వల్ల చర్మం నేల మైక్రోబయోమ్‌తో సంపర్కం చెందును. దీంతో మన రోగనిరోధక శక్తి మెరుగుపడే అవకాశం ఉంది. అందుకే ఇంట్లో చెప్పులు ధరించకపోవడం ఉత్తమం.
పాదాలకు విశ్రాంతి: చెప్పులు లేకుండా ఉండటం వల్ల పాదాలు స్వేచ్ఛగా ఉంటాయి. దీనివల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తగ్గే అవకాశం ఉంది.
సహజ స్పర్శ: పాదాలు నేలను నేరుగా తాకడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా భూమితో మనకు అనుబంధం ఉన్న భావన కలుగుతుంది. రక్త ప్రసరణ సైతం జరుగుతుంది. చిన్న పిల్లలు తొందరగా నడక నేర్చుకునే అవకాశం ఉంది.
నిపుణుల సలహా: ఇంట్లో చెప్పులు ధరించాలా వద్దా అనేది పూర్తిగా మన వ్యక్తిగత నిర్ణయం. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. మన ఆరోగ్య పరిస్థితులపై సైతం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో చెప్పులు ధరించాలనుకుంటే.. బయట వేసుకునే వాటిని ఇంట్లో వాడకూడదు. పరిశుభ్రతను పాటించడానికి ఇంటి లోపలి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన చెప్పులను వాడటం ఉత్తమం. అలాగే.. దేవుడి మందిరం వంటి పవిత్ర ప్రదేశాల్లో చెప్పులు వేసుకోకుండా ఉండటం మన సంప్రదాయంలో భాగం.


