Dental Treatments: ఏవైనా అనుకోని ప్రమాదాల కారణంగా, దంతాలు దెబ్బతినప్పుడు..చంత క్షయం వల్ల దంతాలు పాడైనప్పుడు, చిగుళ్ల వ్యాధి వంటి వాటి వల్ల పంటిని కోల్పోయినప్పుడు ఆ ఖాళీలను పూరించడానికి వంటి మార్పిడి ఒక పరిష్కారం. దెబ్బతిన్న పంటి స్థానాన్ని భర్తీ చేయడానికి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దెబ్బతిన్న పంటికి చికిత్స:
ఒకవేళ పన్ను దెబ్బతిని బలంగా ఉంటే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్+ క్యాప్ విధానంలో చికిత్స అందిస్తారు. రూట్ కెనాల్ చేసిన తర్వాత పంటి మీద క్యాప్ వేస్తే బలంగా ఉంటుంది.
పంటిని తీయడం:
పంటికి ఎక్కువ నష్టం జరిగినప్పుడు దానిని తొలగించి దాని స్థానంలో వేరే పంటిని భర్తీ చేయడం చాలా ముఖ్యమని డెంటిస్టులు చెబుతున్నారు.
Also Read:Diabetes: వయస్సును బట్టి మధుమేహం వచ్చిందని తెలిపే లక్షణాలు ఇవే..
ఇంప్లాంట్:
దెబ్బతిన్న పంటి స్థానంలో శస్త్రచికిత్స ద్వారా దవడ ఎముకలో అమర్చే ఒక టైటానియం స్క్రూ. దానిపై క్యాప్ ఫిక్స్ చేస్తారు. కొత్త దంతానికి కృత్రిమ మూలంగా పనిచేస్తుంది. ఎముక క్షీణతను నివారించి, సహజ దంతంలా పనిచేస్తుంది. మాట్లాడటానికి, నమలడానికి సహాయపడుతుంది. ఈ విధానంలో పక్క పళ్లకు ఎలాంటి హాని ఉండదు. దవడ ఎముకకు ఎలాంటి నష్టం జరగదు. అలాగే ఈ విధానంలో అమర్చిన కృత్రిమ దంతం ఎక్కువకాలం మన్నుతుంది.
బ్రిడ్జ్:
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తప్పిపోయిన దంతాలను భర్తీ చేయడానికి, ఏదైనా కారణం చేత దంతాలు దెబ్బతినడం వల్ల ఏర్పడిన అంతరాన్ని మూసివేయడానికి ఈ చికిత్సా విధానాన్ని అనుసరిస్తారు. తప్పిపోయిన లేదా దెబ్బతిన్న దంతం వల్ల ఏర్పడిన ఖాళీని పూరించడానికి, రెండు వైపులా ఉన్న సహజ దంతాల మధ్య కృత్రిమ దంతాన్ని అమర్చి సిమెంటింగ్ చేస్తారు. ఈ బ్రిడ్జ్ అమర్చిన కృత్రిమ దంతాన్ని “పోంటిక్” అని, బ్రిడ్డ్ను పట్టుకునే పళ్లను “యాంకర్ దంతాలు” అంటారు. ఈ చికిత్స త్వరగా పూర్తవుతుంది. ఖర్చుకూడా తక్కువ. అయితే ఈ బ్రిడ్జ్ అమర్చడానికి పక్కన ఉన్న ఆరోగ్యమైన పళ్లను కొంచెం కత్తిరించాల్సి ఉంటుంది.


