Kanjak Gift Hampers: కన్యా పూజన్ హ్యాంపర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. కన్యాపూజ అంటే బాలికలు నిర్వహించే వ్రతం. చైత్ర నవరాత్రుల్లో భాగంగా బాలికలు అమ్మవారి ఆశీర్వాదం కోసం ఈ కన్యా పూజను నిర్వహిస్తుంటారు. ఈ పూజ చేసే బాలికలను సంతోషపెట్టడానికి పెద్దవాళ్లు సంప్రదాయమైన బహుమతులు ఇవ్వడం ఆనవాయితి. ఇందులో భాగంగా వారికి ఇచ్చే ఈ బహుమతులు ప్రస్తుతం హ్యాంపర్ల రూపంలో ఇవ్వడం ట్రెండ్‌గా మారింది. కంజక్ గిఫ్ట్ హ్యాంపర్లతో పేరుతో ఆన్‌లైన్‌లో, మార్కెట్లో విరివిరిగా అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాక్లెట్లు మొదలు చిప్స్ వరకు చిన్నారులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
నవరాత్రి స్పెషల్
నవరాత్రుల్లో అష్టమి, నవమి రోజుల్లో చేసే కన్యా పూజ ఉత్తరాదిన అత్యంత ముఖ్యమైన సంప్రదాయంగా భావిస్తారు. తమ శక్తికొద్దీ చిన్నారులకు పాద పూజ చేసి, వారిని సంతోషపెట్టేలా బహుమతులు అందజేస్తారు. ఈ ఏడాది వీటికోసం స్పెషల్ హ్యాంపర్స్ రావటం విశేషం. ఫ్యాన్సీ ప్లేట్లు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు, హెయిర్ క్లిప్స్, స్టేషనరీ, చాక్లెట్లతో పలు పెద్ద బ్రాండ్లు ఈసారి గిఫ్ట్ హ్యాంపర్స్ చేసి పెద్ద బిజినెస్ చేసేశాయి. నవరాత్రి స్పెషల్ హ్యాంపర్స్ గా ఇవి హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. వీటిపైన దుర్గామాత స్టిక్కర్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.
హ్యాంపర్ ట్రెండ్ విశేషాలు
సంప్రదాయబద్ధంగా ఇచ్చే స్వీట్లు, డబ్బులకు బదులుగా అందంగా అలంకరించిన బాక్సులు లేదా బ్యాగులలో బహుమతులు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న చిన్న వ్యాపారాలు, ఇన్స్టాగ్రామ్ పేజీలు ప్రత్యేకంగా కన్యా పూజ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాంపర్లను సిద్ధం చేస్తున్నాయి. తక్కువ ధరలోనే ఈ గిఫ్ట్ హ్యాంపర్లు అందుబాటులో ఉంటున్నాయి. రూ. 50 నుంచి రూ. 99 మధ్యలో కూడా లభిస్తున్నాయి.
Also Read: Mosquito coils: డైలీ మస్కిటో కాయిల్స్ వాడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే!
హ్యాంపర్లలో ఉండే వస్తువులు
డిజైనర్ పెన్సిల్ బాక్సులు, రంగురంగుల పెన్నులు, చిన్న డైరీలు నుంచి అలంకరణ వస్తువులు, ఆట వస్తువులు, తినుబండారాలు, భక్తి వస్తువులను వరకు ఈ హ్యాంపర్లలో కనిపిస్తున్నాయి.

