Homeలైఫ్ స్టైల్Quadrobics Trend: ఫిట్‌నెస్‌లో కొత్త ట్రెండ్‌.. క్వాడ్రోబిక్స్ అంటే ఏంటో తెలుసా?

Quadrobics Trend: ఫిట్‌నెస్‌లో కొత్త ట్రెండ్‌.. క్వాడ్రోబిక్స్ అంటే ఏంటో తెలుసా?

Quadrobics Fitness: మారుతున్న కాలం అనుగుణంగా మనుషులు కూడా వారి అలవాట్లను మార్చుకుంటున్నారు. ప్రస్తుత లైఫ్‌స్టైల్‌ భాగంగా చాలా మంది ఫిట్‌నెస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు ఫిట్‌ నెస్‌ మనకేందుకులే అనుకున్న వాళ్లు సైతం.. ఉదయాన్నే లేచి గ్రౌండ్‌, పార్కుల్లో పరుగులు పెడుతున్నారు. ఇక యువతతో జిమ్‌ సెంటర్లు బిజీ అయిపోతున్నాయి. కాలనుగుణంగా ఈ ఫిట్‌నెస్‌ క్రేజ్‌ రోజురోజుకి పెరిగిపోతుంది. ఇందులో కొత్త కొత్త రకాల వ్యయమాలు పుట్టుకొస్తున్నాయి. అలా ప్రస్తుతం క్వాడ్రోబిక్స్‌ ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్‌ అవుతుంది.

- Advertisement -

క్వాడ్రోబిక్స్‌ అంటే.. జంతువుల వలె నాలుగు కాళ్లపై నడవడం, పరిగెత్తడం లేదా గెంతడం, చెట్టు కొమ్మలను చేతులతో పట్టుకుని వేలాడటం. రెండు చేతులు-కాళ్లపై నడవటాన్ని క్వాడ్రోబిక్స్ అంటారు. ఇది ఫన్నీగా అనిపించినా మంచి ఫిట్నెస్ ఉంటేగానీ ఈ వ్యాయమం చేయటం సాధ్యపడదు. మనలోని జంతువును బయటపెడుతూ సాగటమే ఈ ట్రెండ్ లో దాగిన అర్థమని, మనిషి రెండు కాళ్లపై నడవటం మొదలుపెట్టాక ఇంకా జంతువులా ఎందుకుండాలని నెటిజెన్లు చాలామంది ఈ ట్రెండ్ ను విమర్శిస్తున్నారు. అయితే ఫిట్నెస్ లెవెల్ చెక్ చేసుకునేందుకు ఎటువంటి జిమ్ అవసరం లేని కారణంగా ఈ ట్రెండ్ ఫాలో అయ్యేవారి సంఖ్య ఓ రకంగా పెరుగుతోంది.

దీని ప్రత్యేకత
ఇది ఒక వినూత్నమైన ఫిట్‌నెస్ విధానం. దీనివల్ల మనుషులు జంతువుల కదలికలను అనుకరిస్తారు. దీనిని ‘ఫుల్ బాడీ ఫన్నీ వర్కవుట్’ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది శరీరంలోని అన్ని భాగాలను కదిలేల చేస్తుంది. ఈ ఒక్క వ్యాయమంతో ఫుల్‌ బాడీలో కదలికలు ఉండటం వల్ల ఫిట్‌గా మారేందకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రకమైన వ్యాయామం ఒక ట్రెండ్‌గా మారింది. ఈ వ్యాయామం చేసేవారు తరచుగా జంతువుల మాస్క్‌లు (ముఖ్యంగా పిల్లి మాస్క్‌లు) ధరించి వీడియోలు చేస్తుంటారు.

Also Read: Kanjak Hampers: నవరాత్రి స్పెషల్‌.. పిల్లల కోసం ‘కన్యా పూజన్’ హ్యాంపర్స్ ట్రెండ్

కమ్యూనిటీలు కూడా..
రష్యా, జపాన్ లో అయితే ఏకంగా క్వాడ్రోబర్స్ పేరుతో కమ్యూనిటీలే తయారయ్యాయి. ఈ ట్రెండ్ తో బరువు తగ్గటం తేలికని మరికొందరు తమ స్వానుభవం చెబుతుండగా మొత్తానికి కొత్త ఫిట్నెస్ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News