Saturday, June 7, 2025
Homeలైఫ్ స్టైల్Cough Remedies: దగ్గు తగ్గట్లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి..

Cough Remedies: దగ్గు తగ్గట్లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి..

Effective Cough Remedies: సాధారణంగా దగ్గు సమస్యతో కొందరు బాధపడుతుంటారు. దగ్గు ఎక్కువగా ఉండటం వల్ల గొంతు నొప్పి కలుగుతుంది. చాలా మంది మార్కెట్ లో లభించే మందులను ఉపయోగిస్తారు. ఈ మందులు కేవలం ఉపశమన్నాని మాత్రమే కలిగిస్తుంది. దగ్గు అనేది శ్వాసకోశ వ్యవస్థను సంబంధించినది. రాత్రి నిద్రించే సమయంలో చికాకు, గొంతు నొప్పిని కలిగిస్తుంది. ఇది ఎక్కువ అలెర్జీ, ఆస్తమా, జలుబు ఉన్నప్పుడు దగ్గు వస్తుంది. ఈ సమస్య కు కొన్ని ఇంటి చిట్కాలు సహాయపడుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

దగ్గు రకాలు:

దగ్గు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పొడి దగ్గు ఇది శ్లేష్మం, కఫం ఉన్నప్పుడు కలుగుతుంది. గొంతులో చికాకు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు కఫంతో వల్ల కలిగే దగ్గు ఇది శ్వాసనాళాల నుంచి శ్లేష్మాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతుంది.

దగ్గు తగ్గించే ఇంటి చిట్కాలు:

అల్లం:

అల్లంను మనం వంటలోకి ఉపయోగిస్తాము. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గొంతునొప్పి, దగ్గు వంటి సమస్య ను వెంటనే తగ్గిస్తుంది. ఒక చిన్న ముక్క అల్లంను తీసుకొని వేడి నీటిలో మరిగించి టీ తయారు చేసుకోవచ్చు. ఇలా మూడు రోజు చేయడం వల్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

తేనె:

తేనె గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తాయి. దీని గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. లేదా ఏదైనా హెర్బల్ టీలో కూడా తీసుకోవచ్చు. రాత్రి పడుకొనే ముందు తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు.

పసుపు పాలు:

పసుపు ఆహారంలో ఉపయోగిస్తాము. ఇది ఆహారాన్ని రుచికరంగా మార్చుడమే కాకుండా ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. వేడి పాలలో అరటీ స్పూన్ పసుపును కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి మెరుగుపడటంతో పాటు దగ్గు సమస్య ను తగ్గిస్తుంది.

Read more: Cough Remedies: దగ్గు తగ్గట్లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి..

ఉప్పు నీరు:

ఉదయం పూట బ్రేష్ చేసిన తరువాత ఉప్పు నీరు పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, చికాకు వంటి సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పు నీరు తీసుకోవాలి ఈ నీటిని మూడు సార్లు పుక్కలించాలి.

తులసి ఆకు:

తులసి ఆకులలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. తులసి ఆకులను నీటిలో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం వల్ల దగ్గు సమస్య తగ్గుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News