Lemon Peels Benefits: నిమ్మకాయ.. ఈ పేరు వినని వారంటూ ఎవరు ఉండరు. నిమ్మకాయను అనేక రకాలుగా వాడుతారు. ముఖ్యంగా నిమ్మకాయను అనేక ఆహారాలలో రుచికోసం వినియోగిస్తారు. ఇది రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే మనం తరచుగా నిమ్మకాయను వాడిన తర్వాత వాటి తొక్కలను పడేస్తుంటాం. కానీ మీకు తెలుసా? నిమ్మకాయ తొక్కలను అనేక రకాలుగా ఉపయోగించవచ్చని! నిమ్మకాయ తొక్కలలో నూనె, ఆమ్లా అంశాలు ఉంటాయి. ఇవి పాత్రలు, సింకును శుభ్రపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి ఇంటిని రసాయన రహితంగా, సువాసన మార్చగల సహజమైన, చౌకైన సురక్షితమైన పద్ధతి. అయితే ఇప్పుడు నిమ్మ తొక్కలను గృహ నివారణలలో ఏ విధంగా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.
పాత్రలు, సింక్ శుభ్రపరచడంలో
నిమ్మ తొక్కలో పాత్రలు, సింక్ శుభ్రపరచడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇందుకోసం నిమ్మ తొక్కలకు కొద్దిగా ఉప్పు వేసి స్టీల్ లేదా రాగి పాత్రలపై రుద్దాలి. దీంతో వాటిపై పేరుకుపోయిన గ్రీజు, మురికిని తొలగిపోతుంది. దీంతో పాత్రలు మెరుస్తాయి. అంతేకాకుండా నిమ్మకాయ తోకలను కిచెన్ లో సింకును క్లీన్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇది సింక్ లో పేరుకుపోయిన మురికి, వాసన రెండిటిని తొలగిస్తుంది.
ఫ్రిజ్, మైక్రోవేవ్
ఫ్రిజ్ దుర్వాసన పోవాలంటే నిమ్మకాయ తొక్కలను బేకింగ్ సోడాతో కలిపి ఒక గిన్నెలో ఉంచి ఫ్రిజ్ లో పెట్టాలి. ఇది లోపల ఉన్న దుర్వాసనను తొలగించి, తాజా సువాసనను తీసుకువస్తుంది. ఈ తొక్కలో మైక్రోవేవ్ నుండి వాసనను తొలగించడానికి ఉపయోగపడతాయి. ఇందుకోసం నిమ్మకాయ తొక్కులను నీటిలో మరిగించి ఆ ఆవిరితో మైక్రోవేవ్ ను శుభ్రం చేయాలి.
Also: Smart Phones: రాత్రిపూట మీ పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడుతున్నారా..?
సహజమైన ఎయిర్ ఫ్రెషనర్
పొడి నిమ్మ తొక్కలను దాల్చిన చెక్క లేదా లవంగాలతో నీటిలో మరిగించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని గదిలో ఉంచాలి లేదా స్ప్రే చేయాలి. దీంతో ఇది ఇంట్లో సహజమైన, తాజా సువాసనను తీసుకొస్తుంది. నిమ్మతొక్కలను ఇలా వాడితే మార్కెట్ నుండి రసాయన రూమ్ ఫ్రెషనర్‌ల అవసరం ఉండదు.
కీటకాలు, దోమల నుండి ఉపశమనం
నిమ్మ తొక్కల బలమైన సువాసన ఇంట్లోకి వచ్చే దోమలు, చీమలు, ఇతర కీటకాలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ తొక్కలను కిటికీ లేదా తలుపుల దగ్గర ఉంచవచ్చు. ఇది సహజ క్రిమి వికర్షకం.
చెత్త డబ్బా నుండి వాసన
చెత్త డబ్బా దుర్వాసన వస్తే, దానిలో కొన్ని నిమ్మ తొక్కలను వేయాలి. ఈ తొక్కలు తేమను గ్రహిస్తాయి. తాజా సువాసనను నిర్వహిస్తాయి. ఈ నివారణ ముఖ్యంగా వర్షాకాలంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

