Neem Leaves Benefits: వేప ఆకుల నుండి పండ్లు, పూత, బెరడు వరకు ప్రతిదీ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆయుర్వేదంలో వేపను గృహ నివారణల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వేప ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ వంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి వాటి ఉపయోగాని ప్రత్యేకంగా చేస్తాయి. వేప ఆకులు ఆరోగ్య సంరక్షణకు మాత్రమే కాకుండా, అనేక గృహ పనులను కూడా సులభతరం చేస్తాయి. ఈ క్రమంలో వేప ఆకుల 5 గృహ ఉపయోగాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. అనేక ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే దోమలను తరిమికొట్టడంలో వేప ఆకులు ప్రభావవంతంగా పని చేస్తాయి. ఇందుకోసం ఇంట్లో వేప ఆకులను కాల్చాలి. దానితో వచ్చే పొగ దోమలు, చిన్న కీటకాలును పారిపోయేలా చేస్తాయి.ఈ నివారణ వేసవి, వర్షాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Also read: Hairfall: జుట్టు రాలడం తగ్గాలంటే..ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
2. తరచుగా కీటకాలు అల్మారాలో ఉన్న బట్టల్లోకి ప్రవేశిస్తాయి. ఇటువంటి పరిస్థితిలో బట్టల మధ్య ఎండిన వేప ఆకులను ఉంచాలి. ఇది కీటకాలును నిరోధిస్తాయి. అంతేకాదు, బట్టలు చాలా కాలం పాటు సురక్షితంగా ఉంటాయి. ఎండిన వేప ఆకు నాఫ్తలీన్ బాల్స్ కు సహజమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయం.
3. వేప ఆకులు ఇంటిని శుభ్రం చేయడంలో ఎంతో సహాయపడుతాయి. మరిగించిన వేప నీటితో ఇంటిని తుడుచుకోవడం ద్వారా బాక్టీరియా, క్రిములు తొలగిపోతాయి. ఇది ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా, ఇంట్లో ఉండే పిల్లలను ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సహజ క్రిమిసంహారక మందుగా పనిచేస్తుంది.
4. ఈ ఆకులు జుట్టు ఆరోగ్యానికి, చర్మ సంబంధిత సమస్యలకు కూడా ప్రయోజనకరమైనది. వేప ఆకులను పేస్ట్ చేసి ముఖంపై పూయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఇద సమయంలో జుట్టు కడుక్కోవడానికి వేప నీటిని ఉపయోగించడం వల్ల చుండ్రు, దురద సమస్య తగ్గుతుంది.
5. టూత్ బ్రష్ బదులుగా వేప పుల్ల ఉపయోగించడం దంతాలు, చిగుళ్లకు ఎంతో మంచిది. వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల కావిటీస్, చిగుళ్ల వాపు, దుర్వాసన సమస్య తగ్గుతుంది. అంతేకాదు, ఇది సహజ మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది.


