ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ వీక్ సందడి కొనసాగుతోంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే (Valentines Day) జరుపుకుంటారు.. దానికి వారం రోజుల ముందుగానే ఈ ప్రేమికుల పండగ మొదలవుతుంది. ఈ వారంలో ఒక్కో రోజు ఒక్కో రకమైన ఎక్స్‌ప్రెషన్‌తో తమ ప్రేమను చాటుతుంటారు. వాలెంటైన్స్ వీక్‌లో చాక్లెట్ డే (Chocolate Day) కూడా ఒక ప్రత్యేకమైన రోజు. ప్రేమను పంచడానికి చాక్లెట్ కంటే స్వీటెస్ట్ వే మరొకటి ఉండదు. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో మూడోరోజు (ఫిబ్రవరి 9న) చాక్లెట్ డే జరుపుకుంటారు. ఈ రోజు తమకు ప్రియమైన వారికి చాక్లెట్లు ఇస్తుంటారు.
నిజానికి చాక్లెట్ జస్ట్ స్వీట్ మాత్రమేకాదు.. ప్రేమ, ఆనందానికి అది సింబల్. చాక్లెట్ ను చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకూ అందరూ ఇస్టపడతారు. స్నేహితులు, ప్రేమికులు, కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని ఇంకా బలపరిచేందుకు చాక్లెట్ ను కానుకగా ఇస్తుంటారు. ఇక చాక్లెట్ కు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 2వేల ఏళ్ల క్రితమే దీనిని కనిపెట్టినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని సెంట్రల్ అమెరికా, మెక్సికో అడవుల్లో కొకోవా చెట్టు నుంచి తయారు చేశారు. అప్పుడు కొకోవా గింజలతో స్పైసీ చాక్లెట్ డ్రింక్ తయారు చేసేవారంట.
అందులో మసాలాలు, కారం కూడా కలిపేవాళ్లట. అయితే 16వ శతాబ్దంలో స్పానిష్ ప్రజలు కొకోవా గింజల్ని యూరప్ తీసుకెళ్లారు. అప్పటినుంచి చాక్లెట్‌లో షుగర్, మిల్క్ కలపడం మొదలు పెట్టారు.. దీంతో చాక్లెట్ టేస్టీగా మారిపోయింది. అనంతరం ఇది లగ్జరీ ఐటమ్ అయిపోయింది. రోమన్లు ప్రత్యేక సందర్భాల్లో చాక్లెట్ ఇచ్చుకునేవారంట. ఇక ఇది కాలక్రమేనా ఇతర దేశాలకు కూడా పాకింది. చాక్లెట్ ను లవ్ ప్రపోజల్స్ లో, వేడుకల్లో గిఫ్ట్ గా ఇవ్వడం కామన్ అయిపోయింది. ప్రేమికుల మధ్య బంధం మరింత పెరిగేందుకు.. వాలెంటైన్స్ వీక్ లో చాక్లెట్ డే పెట్టారు. దీనితో తమ బంధం మరింత మధురంగా మారుతుందని ప్రేమికుల నమ్మకం.
వాలెంటైన్ వీక్ లో చాక్లెట్ డే జరుపుకోవడం వెను చాలా డీప్ మీనింగ్ ఉంది. చాక్లెట్ లోని తీపి ప్రేమికుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. అందుకే దీనిని గిఫ్ట్ గా ఇస్తే.. వారి రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని నమ్ముతారు. ఏవైనా చిన్నపాటి గొడవలు ఉన్నా చాక్లెట్ ఇస్తే వారి పెదవులపై చిరునవ్వు వస్తుంది. చాక్లెట్ తింటే సెరటోనిన్, డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే మూడ్ బాగోలేనప్పుడు చాక్లెట్ తినాలని నిపుణులు చెబుతారు.. ఇలా చేయడం వల్ల ఒత్తడి కూడా తగ్గుతుంది.