Homeలైఫ్ స్టైల్Watermelon Coffee: సమ్మర్ స్పెషల్.. వాటర్మెలన్ కాఫీ ట్రెండ్..

Watermelon Coffee: సమ్మర్ స్పెషల్.. వాటర్మెలన్ కాఫీ ట్రెండ్..

Watermelon Coffee: వేసవి కాలంలో చల్ల చల్లగా తాగేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకోసం వేసవిలో డిఫరెంట్ ఢిఫరెంట్ కూల్ డ్రింక్స్ టేస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక కొత్త డ్రింక్ ట్రెండ్ హాట్ టాపిక్‌గా మారింది. అదే వాటర్మెలన్ కాఫీ. వినడానికి కొంచెం వింతగా అనిపించినా.. కాఫీ ప్రేమికులు దీన్ని ఆసక్తిగా ట్రై చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇది సమ్మర్ కూల్ డ్రింగ్స్ లో స్పెషల్ మారింది.

- Advertisement -

సాధారణంగా పుచ్చకాయ అంటే శరీరానికి చల్లదనం ఇస్తుందని మనందరికి తెలిసిందే. మరోవైపు కాఫీ అంటే ఎనర్జీని పెంచే పానీయం. ఈ రెండు విభిన్న రుచులను కలిపి తయారు చేసిన డ్రింకే వాటర్మెలన్ కాఫీ. వేడి వాతావరణంలో ఒక ఫ్రెష్ అండ్ యూనిక్ అనుభూతిని ఇస్తుందని చాలామంది చెబుతున్నారు. ముఖ్యంగా తేలికపాటి తీపి రుచి కాఫీకి ఉండే స్ట్రాంగ్ ఫ్లేవర్ కలిసినప్పుడు ఒక కొత్త టేస్ట్‌ను అందిస్తుంది. దీని తయారి విధానం కూడా చాలా సులభం. ఎక్కువ టైం కూడా పట్టదు.

ఎలా తయారు చేసుకోవాలి..
దీని తయారు చేసుకోవాలంటే ముందుగా పుచ్చకాయను ముక్కలుగా చేసుకోవాలి. అలాగే కాఫీ డికాషన్, పాలు, ఐస్ క్యూబ్స్ అవసరం. ముందుగా పుచ్చకాయ ముక్కలను బ్లెండ్ చేసి జ్యూస్‌గా చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కాఫీ డికాషన్ కలపాలి. కావాలనుకుంటే కొద్దిగా పాలు కూడా యాడ్ చేయొచ్చు. చివరగా ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలిపితే చల్లని వాటర్మెలన్ కాఫీ రెడీ అవుతుంది.

ఎందుకంత ప్రత్యేకత?
ఈ డ్రింక్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. పైగా కొత్త రుచులు ట్రై చేయాలని ఇష్టపడే యువతకు ఇలాంటి ఫ్యూజన్ డ్రింక్స్‌కి బెస్ట్ ఆప్షన్. మీరు కాఫీ ప్రియులైతే, ఒకసారి ఈ వాటర్మెలన్ కాఫీని తప్పక ట్రై చేయండి. కొత్త రుచులను అనుభవించాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. అయితే, రుచి వ్యక్తిగతంగా మారవచ్చు కాబట్టి మొదట చిన్న పరిమాణంలో ప్రయత్నించడం మంచిది. ఈ వేసవిలో కూల్‌గా ఉండటానికి వాటర్మెలన్ కాఫీ మీకు మంచి ఛాయిస్ కావచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News