Weight Gain and Weight Loss Disease: ఆరోగ్యకరమైన జీవితానికి సరైన బరువును నిర్వహించడం ఎంతో ముఖ్యం. కానీ, కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం ప్రారంభమవుతుంది. చాలామంది దీనిని సాధారణమైనదిగా భావించి లైట్ తీసుకుంటారు. అయితే ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు సంకేతం కూడా కావచ్చు.
బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంటే, అది శరీరంలో దాగి ఉన్న ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండటం వల్ల ఆరోగ్యం క్షీణించకుండా కాపాడటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు. ఈ నేపథ్యంలో ఏ ఆరోగ్య సమస్యల వల్ల బరువు పెరగడం, తగ్గడం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఏ వ్యాధుల వల్ల బరువు పెరుగుతారు:
థైరాయిడ్ సమస్య:
బరువు సడన్ గా పెరుగుతూ, అలసట, జుట్టు రాలడం లేదా మానసిక స్థితిలో మార్పులు వంటి సమస్యలు ఉంటే అది హైపోథైరాయిడిజం లక్షణం కావచ్చు. ఈ స్థితిలో రోగి శరీర జీవక్రియ మందగిస్తుంది. దీని కారణంగానే బరువు కూడా వేగంగా పెరుగుతుంది.
హార్మోన్ల అసమతుల్యత:
మహిళల్లో PCOS, పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం కూడా ఆకస్మిక బరువు పెరగడానికి కారణమవుతుంది. హార్మోన్ల మార్పుల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
గుండె, మూత్రపిండాల వ్యాధులు:
గుండె, మూత్రపిండాల సమస్యల ఉంటె శరీరంలో నీరు నిలుపుకోవడం ప్రారంభమవుతుంది. ఇది వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. కాళ్ళు, ముఖం మీద వాపు దాని ప్రారంభ లక్షణాలు కావచ్చు.
Also Read: Health: ఫిట్ గా ఉండాలా..?అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!
ఏ వ్యాధుల వల్ల బరువు తగ్గుతారు
డయాబెటిస్:
కొన్నిసార్లు డయాబెటిస్ ప్రారంభ దశలో బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. శరీరం గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది.
థైరాయిడ్:
అకస్మాత్తుగా బరువు కోల్పోతుంటే, వేగవంతమైన హృదయ స్పందన, నిద్ర లేకపోవడం లేదా చిరాకు వంటి లక్షణాలు ఉంటే, అది హైపర్ థైరాయిడిజం సంకేతం కావచ్చు. దీని కారణంగానే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
క్యాన్సర్ లేదా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్:
క్యాన్సర్, టిబి లేదా కాలేయ సమస్యలు వంటి కొన్ని తీవ్రమైన వ్యాధులు కూడా వేగంగా బరువు తగ్గడానికి కారణమవుతాయి. ఇటువంటి సందర్భాలలో వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
ఈ విషయాలు గుర్తించుకోవాలి
ఎటువంటి కారణం లేకుండా బరువు పెరిగితే లేదా తగ్గితే, లైట్ తీసుకోకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలి. అంతేకాదు, సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ 7-8 గంటలు నిద్ర పోవాలి.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


