Drinks 3 Liters Of Water A Day: నీరు మన శరీరానికి అత్యంత అవసరమైనది. ఇది మనల్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా చర్మం, జీర్ణక్రియ, జుట్టు, మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆరోగ్య నిపుణులు 30 రోజుల పాటు ప్రతిరోజూ 3 లీటర్ల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు. ఇలా 30 రోజుల పాటు రోజూ 3 లీటర్ల నీరు తాగితే ఊహించని ఆరోగ్య లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. వారానికి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి వారం: రోజూ 3 లీటర్ల నీరు తాగడం వల్ల మొదటి వారంలో మూత్రపిండాలు విషాన్ని, అదనపు వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. ఫలితంగా తరచుగా మూత్రవిసర్జనను అనుభవించవచ్చు. అనంతరం కొన్ని రోజుల తర్వాత ఈ మూత్రవిసర్జన ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అదనంగా, అదనపు ఉప్పు కూడా తొలగిపోతుంది. వాపు, ఉబ్బరం సైతం తగ్గుతుంది. ఇది శరీరంలోని అంతర్గత శుభ్రపరిచే ప్రారంభ ప్రక్రియ.
also read:Tea With Biscuits: మీకు టీతో పాటు బిస్కెట్లు తినే అలవాటు ఉందా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
రెండవ వారం: రెండవ వారంలో చర్మంలో అనేక మార్పులు సానిపిస్తాయి. నీరు చర్మ కణాలను హైడ్రేట్ చేస్తుంది. ముఖానికి సహజమైన మెరుపును అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ సమయంలో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మలం పెద్ద ప్రేగు గుండా సులభంగా వెళుతుంది. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. 3 లీటర్ల నీరు తాగడం ద్వారా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీంతో పదే పదే తినే అలవాటును కూడా నివారించవచ్చు.
మూడవ వారం: ఈ సమయానికి ఏకాగ్రత, దృష్టి మెరుగుపడటం ప్రారంభమవుతుంది. మూడు లీటర్ల తాగడం వల్ల రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ కూడా అందుతుంది. ఇది మానసిక స్పష్టతను పెంచుతుంది. ఇంకా, కండరాలను సడలిస్తుంది. కండరాల నొప్పిని సైతం తగ్గిస్తుంది.
also read:ABC-Juice Benefits: ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..అస్సలు వదిలిపెట్టారు!
నాల్గవ వారం: నెలాఖరు నాటికి జుట్టు, గోళ్లలో మార్పులు కనిపిస్తాయి. నీరు శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు, గోళ్ల పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అదనంగా, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. తగినంత నీరు త్రాగడం వల్ల శరీరం మొత్తం వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
గుర్తించుకోవాల్సిన విషయాలు:
ఇలా ప్రతిరోజూ 3 లీటర్ల నీరు త్రాగడం ద్వారా శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఇప్పటికే ఎవరికైనా మూత్రపిండాల సమస్యలు లేదా గుండె జబ్బులు ఉంటే, రోజూకు ఎంత నీరు తీసుకోవాలో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

