Tuesday, June 3, 2025
Homeలైఫ్ స్టైల్Death: చనిపోయాక కూడా శరీరం ఈ భాగాలు పనిచేస్తాయంట.. తెలిస్తే షాక్ అవుతారు..!

Death: చనిపోయాక కూడా శరీరం ఈ భాగాలు పనిచేస్తాయంట.. తెలిస్తే షాక్ అవుతారు..!

మనిషి మరణిస్తే అంతా అయిపోతుంది అనుకోవడం సహజం. కానీ శాస్త్రవేత్తలు చెప్పే నిజాలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకుండా ఉండదు. మనం చనిపోయాక కూడా మన శరీరంలోని కొన్ని భాగాలు పని చేస్తుండటం కచ్చితంగా ఒక మిస్టరీ. మరణం వెంటనే శరీరం బిగుసుకుపోతుంది. కండరాలు కుదించుకుంటాయి. కానీ కొన్ని కండరాలు మాత్రం స్వతంత్రంగా పనిచేస్తాయి. అవి మెదడుకి లోబడి ఉండవు. అందుకే మెదడు ఆగిపోయినా, అవి కొన్ని క్షణాలు పని చేస్తూనే ఉంటాయి. దాంతో చేతులు, కాళ్లు కాస్త కదిలినట్టు అనిపించవచ్చు. ఇది చూసినవారికి ఆ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడేమో అనే అనుమానం కలుగుతుంది.

- Advertisement -

ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చర్మం. మనిషి చనిపోయిన తర్వాత కూడా చర్మకణాలు కొన్ని గంటల పాటు జీవించగలవు. ఇవి బయట గాలిలోని ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటూ కొంతకాలం బతికిపోతాయి. కానీ తర్వాత బ్యాక్టీరియాల వల్ల శరీరం క్రమంగా మట్టిలో కలిసిపోతుంది. మరొక శాస్త్రీయ వాస్తవం ఏమిటంటే.. గుండె ఆగిపోయిన తర్వాత కూడా మెదడు కొద్దిసేపు పని చేస్తుంది. దీనినే ‘గోల్డెన్ అవర్’ అంటారు. ఈ సమయంలో సరైన వైద్య సాయం లభిస్తే, గుండె మళ్లీ పని చేయడం కూడా సాధ్యమే. కొన్నిసార్లు వ్యక్తిని తిరిగి బతికించడంలో ఇది కీలకంగా మారుతుంది.

ఇక గర్భవతి మహిళ మరణించినప్పుడు, ఆమె శరీరంలో ఏర్పడే వాయువులు గర్భంలో ఉన్న శిశువును బయటకు నెట్టేలా చేస్తాయి. ఇది ప్రకృతి చేసే అద్భుత స్రుష్టి. తల్లి లేనప్పటికీ బిడ్డను ప్రాణాలతో బయటకు తీసే ప్రయత్నం, జీవాన్ని నిలబెట్టే ప్రకృతి శక్తికి నిదర్శనం. చనిపోయిన తర్వాత శరీరంలో గ్యాస్ ఏర్పడి, దాని ప్రభావంతో మలం బయటకు రావచ్చు. జీర్ణతంత్రంలో ఉన్న బాక్టీరియా కొంతకాలం బతికిపోతూ ఈ ప్రక్రియను నడిపిస్తుంది.

కొందరి శవాల్లో పోస్ట్‌మార్టం సమయంలో అంగస్తంభన కనిపించవచ్చు.. ఇది సహజమైన శారీరక ప్రతిక్రియ మాత్రమే. అలాగే చనిపోయిన తర్వాత వెంట్రుకలు, గోర్లు పెరిగినట్టు అనిపించవచ్చు. కానీ వాస్తవానికి అవి పెరగడం కాదు. చర్మం ముడుచుకోవడం వల్ల అవి బాహ్యంగా ఎక్కువ కనిపిస్తాయి. చివరగా, మరణించిన వ్యక్తి గొంతులోంచి ఒక్కోసారి శబ్దం వినిపించవచ్చు. ఇది శరీరంలో ఏర్పడిన గ్యాస్ ఊపిరితిత్తులపై ఒత్తిడి కలిగించడంతో, ఆ గ్యాస్ గొంతు ద్వారా బయటకు రావడమే కారణం.

ఈ రహస్యాలన్నింటి వెనక శాస్త్రీయ కారణాలున్నాయి. శవ పరీక్షల సమయంలో నిపుణులు ఈ విపరీతమైన విషయాలను గమనిస్తారు. శాస్త్రవేత్తలు ఇవి ఆధారంగా మరణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. భవిష్యత్తులో మరణాన్ని జయించే ప్రయత్నాలు కూడా శోధన దశలో ఉన్నాయి. ఆ రోజు వస్తే, జీవితం ఎలా ఉంటుందో ఊహించడమే కష్టమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News