Boy Kibble: సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొత్త ఫుడ్ ట్రెండ్స్ వైరల్ అవుతుంటాయి. ఇటీవల టిక్ టాక్, ఇన్స్టా్గ్రామ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో జెన్ జీ ఎక్కువగా ఫాలో అవుతున్న ట్రెండ్ “బాయ్ కిబిల్”. ఇది “గర్ల్ డిన్నర్” ట్రెండ్‌కు పురుషుల వెర్షన్‌గా చెప్పుకోవచ్చు. చూడటానికి కొంచెం అసాధారణంగా కనిపించినా, ఈ డైట్ సింపుల్, ప్రాక్టికల్‌గా ఉండటం వల్ల చాలామందిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవారిలో ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది.
వన్ పాట్ డిష్.. సింపుల్ మీల్ ఐడియా
“బాయ్ కిబిల్”లో ప్రధానంగా ఒకే గిన్నెలో వండే వన్ పాట్ డిష్ ఉంటుంది. ఇందులో సాఫ్ట్ మీట్, అన్నం, గుడ్లు, కొద్దిగా కూరగాయలు, కొవ్వు పదార్థాలు కలిపి సులభంగా వండేస్తారు. ఈ డైట్‌లో ప్రొటీన్, కార్బోహైడ్రేట్లపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఇది తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో తయారయ్యే మీల్ కావడంతో స్టూడెంట్స్, బ్యాచిలర్స్, ఫిట్‌నెస్ లవర్స్ కి ఇది మంచి ఫేవరేట్ గా మారింది. ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణం దాని సింప్లిసిటీ. రోజూ కష్టపడి వంట చేయడానికి టైమ్ లేకపోయేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. పైగా హై ప్రొటీన్ డైట్ కావడంతో బాడీ బిల్డింగ్ లేదా ఫిట్‌నెస్ గోల్స్ ఉన్నవారు దీన్ని ఎక్కువగా అనుసరిస్తున్నారు.
విమర్శలు కూడా ఉన్నాయి
అయితే, ఈ “బాయ్ కిబిల్” ట్రెండ్‌పై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. రుచి పరంగా ఇది చాలా సాదాసీదాగా ఉంది. అదే విధంగా సరైన ఫైబర్, విటమిన్స్, మినరల్స్ లేమి ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎక్కువకాలం ఫాలో అయితే అసమతుల్య ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మీరు ఈ ట్రెండ్‌ను ట్రై చేయాలనుకుంటే పూర్తి స్థాయిలో దీని మీద ఆధారపడకుండా బ్యాలెన్స్‌డ్ డైట్‌లో భాగంగా మాత్రమే తీసుకోవడం మంచిది. ప్రోటీన్‌తో పాటు కూరగాయలు, పండ్లు, ఇతర పోషకాలు కూడా సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. సింపుల్, ఫాస్ట్, హై ప్రొటీన్ మీల్‌గా “బాయ్ కిబిల్” ఆకర్షణీయంగా ఉన్నా దీన్ని జాగ్రత్తగా అనుసరించడం అవసరం. ట్రెండ్ కంటే ఆరోగ్యం ముఖ్యం అనే విషయం మాత్రం గుర్తుంచుకోవాలి!

