Homeలైఫ్ స్టైల్Girl Dinner: యూత్‌ని ఆకట్టుకుంటున్న గర్ల్ డిన్నర్ ట్రెండ్.. అంటే ఏంటో తెలుసా?

Girl Dinner: యూత్‌ని ఆకట్టుకుంటున్న గర్ల్ డిన్నర్ ట్రెండ్.. అంటే ఏంటో తెలుసా?

Girl Dinner Trend: వారమంతా పని, ఒత్తిడి, పరుగుల మధ్య గడిపిన తర్వాత వీకెండ్‌లో రిలాక్స్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా యువతలో ఇప్పుడు ‘గర్ల్ డిన్నర్’ అనే కొత్త ట్రెండ్ బాగా వైరల్‌ అవుతోంది. ఇది కేవలం భోజనం మాత్రమే కాదు స్వయంగా మనకు మనమే ఇచ్చుకునే చిన్నపాటి బ్రేక్. చెప్పాలంటే ప్రస్తుతం బిజీ లైఫ్‌, పని ఒత్తిడి నుంచి కాస్తా రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లడమే ఈ గర్ల్‌ డిన్నర్‌ అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇంతకి గర్ల్ డిన్నర్ అంటే ఏంటి?
గర్ల్ డిన్నర్ అంటే ప్రత్యేకంగా వండి భోజనం చేయడం కాదు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఫుడ్స్‌తో మనకు నచ్చిన వాటితో ఒక చిన్న విందు చేసుకోవడం. స్ట్రెస్‌ను దూరం చేసుకుని మనసుకు నచ్చిన విధంగా తినటం. వికెండ్‌ ఎంజాయ్‌ చేస్తూ కొత్త వారాన్ని ఫ్రెష్‌గా స్వాగతించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ట్రెండ్‌లో ప్రధాన ఉద్దేశం వంటకు దూరంగా ఉండటమే ప్రత్యేకత. క్రాకర్స్, హమ్మస్, కూరగాయలు, పండ్లు, నట్స్, స్నాక్స్ ఇలా ఇంట్లో ఉన్న ఏదైనా సరే కలిపి ఒక ప్లేట్‌గా తీసుకుంటారు. పాప్‌కార్న్, చిప్స్, పెరుగు, జ్యూస్, బ్రెడ్, చీజ్ ఇలా ఏది ఉన్నా సరే వాటితోనే డిన్నర్ పూర్తి చేసుకోవచ్చు.

స్ట్రెస్ ఫ్రీ టైమ్
వంట చేసే ఓపిక లేకపోయినా.. ఇంట్లో సరుకులు తక్కువగా ఉన్నా లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ గర్ల్ డిన్నర్ మంచి ఆప్షన్. ఇది కేవలం తినటానికి మాత్రమే కాదు మనసును రిలాక్స్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. యువత తమ గర్ల్ డిన్నర్ ప్లేట్స్‌ను క్రియేటివ్‌గా ప్రెజెంట్ చేసి షేర్ చేస్తున్నారు. మొత్తానికి, గర్ల్ డిన్నర్ అనేది సింపుల్‌గా కనిపించినా.. మనసుకు హాయిని ఇచ్చే ట్రెండ్. వంటచేయడం వంటి స్ట్రెస్ లేకుండా. మనకు నచ్చిన విధంగా రిలాక్స్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఐడియా అని చెప్పోచ్చు.

Also Read: East-West Trend: ఈస్ట్–వెస్ట్ ట్రెండ్: వింటేజ్ ఫ్యాషన్‌కు కొత్త స్టైల్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News