Monday, February 16, 2026
Homeలైఫ్ స్టైల్Carnivore Diet: కార్నివోర్ డైట్ ఏంటి ఏమిటి..? ఇందులో ఏమేం ఉంటాయి..? ఫాలో అవుతే మంచిదేనా..?

Carnivore Diet: కార్నివోర్ డైట్ ఏంటి ఏమిటి..? ఇందులో ఏమేం ఉంటాయి..? ఫాలో అవుతే మంచిదేనా..?

Carnivore Diet Trend: బరువు తగ్గేందుకు ప్రస్తుతం అనేక రకాల డైట్ ప్లాన్లు ట్రెండ్ అవుతున్నాయి. కీటో, పేలియో తర్వాత ఇప్పుడు ‘కార్నివోర్ డైట్’పై విస్తృత చర్చ జరుగుతోంది. ఫిట్‌గా, ఆరోగ్యంగా, నిత్య యవ్వనాన్ని కాపాడుకోవాలన్న ఆశతో చాలా మంది ఈ ట్రెండీ డైట్ ను ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా, హై ఫ్యాట్ కార్నివోరస్ బ్రేక్‌ఫాస్ట్‌ను సెలబ్రిటీలు ఆసక్తిగా ఫాలో అవుతుండటంతో, అదే బాటలో సామాన్యులు ఫాలో అవుతున్నారు. అయితే, భారతీయుల వైవిధ్యమైన ఆహార అలవాట్లకు ఇది ఎంతవరకు సరిపోతుందనే సందేహాలు ఉన్నాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాల లోపం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ డైట్ తో దీర్ఘకాలంలో జీర్ణక్రియ, గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని చెబుతున్నారు.

- Advertisement -

 

కార్నివోర్ డైట్ అంటే ఏమిటి?

కార్నివోర్ డైట్‌ను సాధారణంగా మీట్ ఓన్లీ డైట్ అని పిలుస్తారు. అంటే ఇందులో పూర్తిగా అనిమల్ బేస్డ్ ఫుడ్స్ మాత్రమే ఉంటాయి. మొక్కల నుంచి వచ్చే పండ్లు, కూరగాయలు, ధాన్యాలను పూర్తిగా మానేసి మాంసం, చేపలు, గుడ్లు, కొద్దిగా పాల ఉత్పత్తులతో కూడిన జీరో కార్బ్ డైట్ ఇది. దీనివల్ల ప్రారంభ దశలో బరువు తగ్గడం, ఇన్సులిన్ స్థాయిలు వేగంగా నియంత్రణలోకి రావడం జరుగుతాయి. అయితే, ఇది తాత్కాలిక ప్రయోజనమే. ఆ తర్వాత దీర్ఘకాలంలో ఫైబర్ లోపం, జీర్ణ సమస్యలు, విటమిన్ లోపాలు తలెత్తుతాయి. అంతేకాదు మూత్రపిండాల వ్యాధులు, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం కూడా పెరగవచ్చు.

also read: idli: జాగ్రత్త..ప్రతిరోజూ ఇడ్లిలు తింటే డేంజరేనట..!

కార్నివోర్ డైట్ లో తినాల్సినవి

తినాల్సినవి: రెడ్ మీట్, చేపలు, కోడిగుడ్లు, వెన్న, నెయ్యి వంటి జంతు సంబంధిత ఆహార పదార్థాలు.

తినకూడనివి: పండ్లు, కూరగాయలు, పప్పులు, బియ్యం, గోధుమలు, నట్స్, టీ, కాఫీ.

కార్నివోర్ డైట్ ఫాలో అవుతే మంచిదేనా?

ఈ మీట్ ఓన్లీ డైట్ ఫాలో అవ్వడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె సంబంధిత వ్యాధుల ముప్పు ఎక్కువ ఉండవచ్చు. దీర్ఘకాలంగా అధిక ప్రోటీన్‌, అధిక కొవ్వు ఉన్న ఆహారం తీసుకుంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే, అధిక మాంసాహారం వల్ల కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా కాలక్రమేణా మూత్రపిండాల పనితీరు తగ్గి కిడ్నీ సంబంధిత వ్యాధులు తలెత్తవచ్చు. కేవలం బరువు తగ్గాలనే లక్ష్యంతో కఠినమైన డైట్లు అనుసరించడం ప్రమాదకరం. ఇలాంటి డైట్లు మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News