White Onion Vs Red Onion: వంటింట్లో ఉండే అనేక ఆహార పదార్థాలలో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయ లేకుండా ఏ వంట కూడా చేయలేం. చాలామంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయతో అనేక విధాలుగా కర్రీస్ చేస్తుంటారు. ఉల్లిపాయ ఆహార రుచిని పెంచమే కాకుండా అనేక ఆరోగ్య లాభాలను అందిస్తాయి. ఉల్లిపాయలు తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తాయి. అయితే ఇవి వాటి లక్షణాలు, పోషకాలలో విభిన్నంగా ఉంటాయని తెలుసా? చాలామంది తరచుగా వీటిని ఒకేలా భావిస్తూ వంటకాలలో ఉపయోగిస్తారు. కానీ, ఈ ఉల్లిపాయల ప్రభావాలు, ప్రయోజనాలు శరీరాన్ని భిన్నంగా ప్రభావితం చేస్తాయి.
ఎర్ర ఉల్లిపాయలు ఎక్కువ ఘాటుగా, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. మరోవైపు..తెల్ల ఉల్లిపాయలు ఘాటుగా లేనప్పటికీ తేలికపాటి రుచిని కలిగి ఉంటాయి. ఈ రెండింటిలో విటమిన్లు సి, బి6, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అయితే, వీటి ఉపయోగాలు, ఆరోగ్య ప్రభావాలు గణనీయంగా భిన్నంగా ఉంటాయి. ఎర్ర, తెల్ల ఉల్లిపాయల లక్షణాలలో ఎలాంటి తేడాలు ఉంటాయి? వీటిని ఎప్పుడు ఆహారంలో చేర్చుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
also read:Pomegranate Peel Tea: దానిమ్మ తొక్కలతో టీ..బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు!
రుచి, ఉపయోగాలలో తేడాలు: ఈ ఉల్లిపాయ రుచి, ఉపయోగాల విషయానికి వస్తే, ఎర్ర ఉల్లిపాయలు ఎక్కువ ఘాటుగా, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. వీటిని సలాడ్‌లు లేదా చట్నీలు రూపంలో ఉపయోగించవచ్చు. ఇక తెల్ల ఘాటుగా లేనప్పటికీ తేలికపాటి రుచిని కలిగి ఉంటాయి. వీటిని శాండ్‌విచ్‌లు, డైలీ వంటకాలలో వాడవచ్చు. వేసవిలో తినడానికి తెల్ల ఉల్లిపాయలను ఎంచుకోవాలి.
పోషక తేడాలు: ఎర్ర ఉల్లిపాయలలో ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అలాగే శరీర రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుంది. వీటిలో మంచి మొత్తంలో ఐరన్ ఫైబర్ కూడా ఉంటాయి. మరోవైపు..తెల్ల ఉల్లిపాయలలో ఫ్లేవనాయిడ్లు, సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, ఆమ్లతను తగ్గించి కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఆరోగ్య లాభాలు: ఎర్ర ఉల్లిపాయలను తినడం గుండె, రక్తపోటుకు ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తెల్ల ఉల్లిపాయలు ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. కడుపు సమస్యలతో బాధపడుతుంటే ఎర్ర ఉల్లిపాయలకు బదులుగా తెల్ల ఉల్లిపాయలు తినడం మంచిది.
సీజన్ ప్రకారం ఏ ఉల్లిపాయలు మంచివి: వేసవి కాలంలో తెల్ల ఉల్లిపాయలను తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇది వడదెబ్బను నివారిస్తుంది. చలికాలంలో ఎర్ర ఉల్లిపాయలు తినడం వల్ల శరీర వేడి పెరుగుతుంది. ఇది జలుబు, ఫ్లూ నుండి రక్షిస్తుంది. సీజన్ ప్రకారం ఉల్లిపాయలను ఎంచుకోవడం వల్ల రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.


