Women have hair under their chin: చాలామంది అమ్మాయిల్లో గడ్డం కింద జుట్టు రావడం ఈమధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ అవాంఛనీయ వెంట్రుకలను తొలగించుకోవడానికి చాలామంది బ్యూటీ క్లినిక్ లను ఆశ్రయించడం కూడా చూస్తున్నాం. కొందరు స్త్రీలు, అమ్మాయిల్లో కనిపించే ఈ సమస్యకు ప్రధాన కారణం వారిలోని హార్మోన్ల అసమతౌల్యత. దీనివల్లే ఫేషియల్ హెయిర్ సమస్యను ఇలాంటివాళ్లు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యకు పరిష్కారం మన అందుబాటులోనే ఉందంటున్నారు డైటీషియన్ మన్ ప్రీత్ కల్రా. ఈ సమస్య పరిష్కారానికి వాడే పదార్థాలు ప్రతిఒక్కరి వంటింట్లో ఉండేవేనని చెప్పారు. ఇవి శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతను నివారించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయని అంటున్నారు. వాటితో చేసుకునే సింపుల్ టీ రెసిపీతో ఈ సమస్యను సహజంగా, మరెంతో సులువగా అధిగమించవచ్చని మన్ ప్రీత్ వంటి డైటీషియన్లు అంటున్నారు.
శరీరంలో యాండ్రోజన్ పాళ్లు అధికమవడం వల్ల స్త్రీలలో అవాంఛనీయ వెంట్రుకల సమస్య తలెత్తుతుంటుంది. స్త్రీల శరీరంలో యాండ్రోజన్స్ తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటి పరిమాణం శరీరంలో పెరిగినపుడు ఫేషియల్ హెయిర్ సమస్య మహిళల్లో తలెత్తుతుంది. ఇంకా కొన్ని విషయాలు కూడా మహిళల్లో ఈ సమస్యకు దారితీస్తున్నాయి. పోలొసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసివొఎస్) ఉన్నవారిలో రుతుక్రమం సక్రమంగా ఉండదు. అంతేకాదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల శరీరానికి అవసరమైన వాటికన్న అధికపాళ్లల్లో యాండ్రోజన్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ ప్రమాణాలు పెరిగినపుడు అండాశయం లో యాండ్రోజన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి అవాంఛనీయ వెంట్రుకలు పెరగడానికి కారణమవుతాయి. అలాగే ఊబకాయంతో కూడా శరీరంలో హార్మోన్ల అసమతుల్యతలు పెరిగి యాండ్రోజన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడి, నిద్రలేమి కారణాలతో కూడా హార్మోన్ల పనితీరులో సమస్యలు తలెత్తి అసమతుల్యత ఎదుర్కుంటారు. దానివల్ల కూడా స్త్రీల శరీరాలలో యాండ్రోజన్స్ పెరుగుతాయి.
Also Read: Ayurvedic Lifestyle for glowing skin: చర్మాన్ని మెరిపించే లైఫ్ స్టైల్ చిట్కాలు
ఈ అవాంఛనీయ వెంట్రుకలను తొలగించుకోవడానికి మార్కెట్ లో రకరకాల క్రీములు, రేజర్లు అందుబాటులో లేకపోలేదు. కానీ, అవి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వవు. ఈ సమస్య తలెత్తడానికి మూలకారణాన్ని ఇవి పరిష్కరించలేవు. మీరు తీసుకునే డైట్ విషయంలో కొన్ని మార్పులు అనుసరిస్తే శరీరంలో హార్మోన్ల వ్యవస్థ గాడిలోపడి హార్మోన్ల అసమతుల్యత తలెత్తదంటున్నారు పోషకాహారనిపుణులు. ఈ సమస్యను పరిష్కరించడానికి యాండ్రోజన్ టీ బాగా పనిచేస్తుందని డైటీషియన్ మన్ ప్రీత్ అన్నారు. ఇది హార్మోన్లు ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుందన్నారు. ఈ టీతో ముఖంపై, గడ్డంకింద తలెత్తే వెంట్రుకల పెరుగుదలను అత్యంత సహజంగా అరికడుతుందని తెలిపారు.
ఈ టీ తయారీకి ఒక టీస్పూన్ మెంతులు, చిటికెడు దాల్చినచెక్క పొడి, ఒక స్పియర్మింట్ టీ బ్యాగు రెడీ పెట్టుకోవాలి. ఒక జార్ తో నీళ్లు తీసుకుని అందులో మెంతులు వేయాలి. అందులోనే ఒక చిటికెడు దాల్చినచెక్క పొడిని కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. తర్వాత ఆ నీటిని ఒక కప్పులో పోసి అందులో స్పియర్మింట్ టీ బ్యాగును కొన్ని నిమిషాలు ఉంచాలి. అంతే యాండ్రోజన్ టీ రెడీ. ఈ టీని నిత్యం తాగడం వల్ల కొన్ని రోజులకు గడ్డం కింద పెరిగిన అవాంఛనీయ వెంట్రుకలు తగ్గుతాయి.
ఈ టీనే కాకుండా గడ్డం మీద పెరిగిన అవాంఛనీయ వెంట్రుకలను తొలగించే మరికొన్ని పదార్థాలు కూడా ఉన్నాయి. వాటిల్లో తులసి ఒకటి. ఒత్తిడితో పెరిగిన కోర్టిసాల్ ప్రమాణాలను తగ్గించడంలో తులసి ఎంతో బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ములేతి (లికోరైస్ రూట్). ములేతిలో యాంటి-యాండ్రోజెనిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు టెస్టోస్టెరాన్ ను క్రమబద్ధీకరించడంలో కూడా ఉపయోగపడుతుంది. ములేతి టీ తాగినా, లేదా దాని సప్లిమెంటు వాడినా హార్మోన్ హెచ్చుతగ్గులు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.
ఇంకొకటి అవిశెగింజలు. ఈ గింజల్లో ఓమేగా-3 పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు లిగ్ననన్స్ అంటే మొక్కల్లో కనిపించే ఒకరకమైన రసాయన సమ్మేళనాలు కూడా వీటిల్లో బాగా ఉంటాయి. ఇవి రెండూ కూడా యాండ్రోజన్స్ ను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. హార్మోన్ల సమతుల్యతను పరిరక్షిస్తాయి. ఓట్మీల్, సలాడ్, స్మూదీలలో వీటిని చల్లుకుని తింటే చాలా మంచిది. నట్స్, గింజలు కూడా హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో ఎంతో ఉపయోగపడతాయి. వాల్నట్స్ , బాదంపప్పులు, పొద్దుతిరుగుడుపువ్వు గింజలు (సన్ ఫ్లవర్ సీడ్స్)లలో ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల ప్రమాణాలు స్థిరంగా ఉంటాయి. అంతేకాదు శరీరంలో పెరిగిన అధిక యాండ్రోజన్ ప్రమాణాలను కూడా బాగా తగ్గిస్తాయి. ఆకుకూరలు కూడా తినడం మంచిది. ముఖ్యంగా పాలకూర, మెంతికూర, కలె ఆకుకూరలు మన కాలెయాన్ని అత్యంత సహజంగా డిటాక్స్ చేస్తాయి. శరీరం లోపలనుంచీ హార్మోన్ల పనితీరును క్రమబద్ధీకరించి సమతుల్యంగా ఉండేలా చేస్తాయి.


