Homeలైఫ్ స్టైల్Lazy Girl Jobs: లేజీ గర్ల్ జాబ్ ట్రెండ్.. అంటే ఏంటో తెలుసా?

Lazy Girl Jobs: లేజీ గర్ల్ జాబ్ ట్రెండ్.. అంటే ఏంటో తెలుసా?

Lazy Girl Jobs: ప్రస్తుత కాలంలో ఉద్యోగాలపై యువత ఆలోచనా విధానం పూర్తిగా మారుతోంది. ముఖ్యంగా జెన్ జీ తరానికి ‘లేజీ గర్ల్ జాబ్’ అనే కొత్త ప్రొఫెషనల్ ట్రెండ్ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. అయితే ఈ పదం వినగానే చాలామందికి తప్పు అర్థం వస్తుంది. ఇది లేజీగా ఉండే ఉద్యోగం కాదు, లేదా పని చేయకుండా జీతం తీసుకోవడం కాదు. అసలు అర్థం—ఉద్యోగం జీవితంలో ఒక భాగం మాత్రమే, మొత్తం జీవితం కాదు అన్న దృష్టికోణం.

- Advertisement -

ఈ తరానికి ఉద్యోగం అంటే కేవలం బతుకుతెరువు, జీవితం కోసం అవసరమైన ఆదాయం మాత్రమే. అందుకే వ్యక్తిగత జీవితం, మానసిక ప్రశాంతత, హాబీస్, కుటుంబంతో గడిపే సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఆలోచనలతోనే వారు కొత్త కెరీర్ స్టైల్స్‌ను ఎంచుకుంటున్నారు.

రిమోట్ వర్క్
లేజీ గర్ల్ జాబ్ ట్రెండ్‌లో ప్రధాన అంశం వర్క్-లైఫ్ బ్యాలెన్స్. అంటే అధిక ఒత్తిడి, ఎక్కువ పని గంటలు, ఎప్పుడూ ఆఫీస్ పనుల్లో నిమగ్నమై ఉండే విధానం కాకుండా, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పని చేసి ఆ తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడం. డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాల్లో ఒత్తిడి తక్కువగా ఉండటంతో పాటు మంచి జీతం కూడా లభిస్తుంది. అందుకే జెన్ జీ ఈ రకాల ఉద్యోగాలను ఎక్కువగా ఎంచుకుంటోంది. రిమోట్ జాబ్స్, ఫ్రీలాన్సింగ్, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ వంటి అవకాశాలు కూడా ఈ ట్రెండ్‌కు మరింత బలం చేకూరుస్తున్నాయి.

బర్నౌట్‌కు చెక్
ఈ ట్రెండ్‌లో ముఖ్య ఉద్దేశ్యం.. అధిక ఒత్తిడితో వచ్చే బర్నౌట్‌ను నివారించడం. తక్కువ శ్రమతో సమర్థవంతంగా పని పూర్తి చేసి, మిగిలిన సమయాన్ని తమ కోసం వినియోగించుకోవడం జెన్ జీ లక్ష్యం. పని జీవనోపాధి మాత్రమే కానీ జీవితం కాదు అనే భావన. మొత్తానికి “లేజీ గర్ల్ జాబ్” అనేది అలసత్వానికి ప్రతీక కాదు, తెలివైన పని విధానానికి సంకేతం. వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను కాపాడుకుంటూ, మానసిక ప్రశాంతతతో జీవించాలనుకునే వారికి ఇది ఒక కొత్త మార్గం. ఆధునిక యువత తమ జీవితాన్ని ఎలా చూడాలో చెప్పే ట్రెండ్‌గా ఇది నిలుస్తోంది.

Also Read: Floral Nail Art: ఫ్లోరల్ నెయిల్స్ క్రేజ్‌.. సమ్మర్ ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News