‘‘వెళ్తూ వెళ్తూ ప్రపంచాన్ని నీ వెంట తీసుకుపో’’
– కవి మఖ్దూం మొహియుద్దీన్
తెలుగు సాహిత్యంలో తొంభైల తరువాత అణగారిన సమూహాల గొంతు పెరిగింది. అప్పటి దాకా తెలుగు సాహి త్యాన్ని కేవలం బ్రాహ్మణ అగ్రకులాలు మాత్రమే ఏలాయి. బహుజనులు కూడా ఉన్నప్పటికీ వారి సంఖ్య వేళ్ల మీదికి పరిమితం. కవిత్వంలో బోయి భీమన్న, జాషువా…, కథల్లో కొలకలూరి ఇనాక్, బోయ జంగయ్య వంటి వారు అరుదుగా వినిపించేవారు. కనిపించేవారు. అస్తిత్వ ఉద్యమాల చైతన్యం పెరగిన తరువాత బాధిత సమూహాల నుండి రాసేవారి సం ఖ్య గణనీయంగా పెరిగింది. ఒక రకంగా తెలుగు సాహిత్యా న్ని ఇప్పుడు అస్తిత్వ గొంతుకలే నడిపిస్తున్నాయంటే అతిశ యోక్తి కాదు. దళిత, స్త్రీవాదాల తరువాత ముస్లింవాద సాహి త్యం అనేక ప్రశ్నల్ని మన ముందుకు తీసుకొచ్చింది. అట్లా సాహిత్యంలో ముస్లింవాదాన్ని బలంగా నిలబెట్టిన గొంతుక స్కైబాబ.
కవిత్వంలో, కథల్లో తనదైన ముద్రను నిలబెట్టుకున్న ఈ సాహిత్యోద్యమకారుడి పాత్ర అద్వితీయమైంది. రెండవ శ్రేణి పౌరులుగా చూడబడుతున్న సమాజపు నిత్య వివక్షను ఎత్తిప ట్టింది స్కై సాహిత్యం. అనేక ప్రశ్నలను మన ముందుంచింది. ఆయన వెలువరించిన ‘అధూరె’ కథల సంపుటి సంచలనం రేపింది. ఉమ్మడి రాష్ట్రంలో అనేక చోట్ల ఆ పుస్తక పరిచయ సభలు పదుల సంఖ్యలో జరిగాయి. ఆ సభలు కేవలం రచ యితను గురించో, రచనను గురించో చర్చించలేదు. మొత్తం ముస్లిం సమాజాన్ని చర్చకు పెట్టింది అధూరె. మేధావులను, సాహిత్యకారులను ఆలోచనలో పడేసింది. ఇక పాఠకులనైతే సరేసరి. ఈ సందర్బంగా స్కై కథన శైలిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకు స్కై కథలు ఎవరికైనా నచ్చుతాయి అన్నది అసలు ప్రశ్న! ఆ కథల్లో తాను ఎంచుకున్న ఇతి వృత్తాలు సూటిగా హృదయాన్ని తాకుతాయి. ‘వెజిటేరియన్స్ ఓన్లీ’ కథను తీసుకుంటే ఎక్కడికి వెళ్లినా ముస్లింలను, దళితు లను వెంటాడే వివక్షను చాలా ఘాటుగా చర్చకు పెట్టింది. ముస్లింలను మత వివక్ష వెంటాడితే, దళితులను కుల వివక్ష వెంటాడింది. అదే వెజిటేరియన్స్ ఓన్లీ బోర్డులుగా వెలిశాయి. ఆ బోర్డులు ఇవాళ ముదిరి పాకానపడి ‘హిందువులకు మాత్ర మే’ అనే స్థాయికి చేరుకున్నాయి. ఇలా కండ్లముందటి ఒక బహిరంగ రహస్యాన్ని చర్చకు పెట్టాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యమున్న రచయితగా స్కై ఈ కథను చక్కగా మలిచాడు. అందుకే ఇది అనేక భాషల్లోకి అనువదించబడింది. ఇంగ్లీష్‌లో వెలువడిన తన కథల పుస్తకానికి సైతం ఇదే శీర్షికై నిలిచింది.
ఇక ఆహార సంస్కృతి మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తు న్న కాలంలోనే స్కై రాసిన మంచి కథ ‘లతీఫ్ మియా శాస్త్రం.’ ఈ కథలో తెలంగాణ ముస్లిం జిందగీని కండ్లకు కట్టిండు. బీఫ్ రాజకీయాల పేరుతో ముస్లింలను, దళితులను టార్గెట్ చేసు కున్నాయి సంఘపరివార్ శక్తులు. కొత్తగా గోరక్షక్ దళాలు పుట్టుకొచ్చాయి. ఇలాంటి సమయంలో ఒక పేద ముస్లిం తన కూతురు పెళ్లిలో పైసలు ఎల్లక బీఫ్‌ను పెట్టడం, దానికి సూదరి కులాలు మద్దతు తెలుపే విధానం హృద్యంగా సాగు తుంది. నేటికి ఈ దేశంలో దళితులకు, ముస్లింలకు పౌష్టికా హారం అందుతున్నది బీఫ్ వల్లనే అనేది కాదనలేని నగ్న సత్యం. అలాంటి ఒక సామాజిక అంశాన్ని అద్భుత కథనంతో ఆకట్టుకున్నాడు రచయిత. ఇది ఇటీవల కేంద్ర సాహిత్య అకాడెమి బై మంత్లీ మ్యాగజైన్‌లో ఇంగ్లీష్‌లో ముద్రించబడ డం విశేషం. అలాగే ‘జీవం’ కథ చావు కల నేపథ్యంగా ఒది గింది. మనిషి ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటాడు. ఎన్నో బంధాలను కలుపుకుంటాడు. ఎన్నెన్నో బంధాలను పరిస్థితు లను బట్టి వదులుకుంటాడు. కానీ, ఒక్కసారి చావు ఎవ్వరి కైనా తప్పదనే చేదునిజం తెలుసుకుంటాడు. అప్పటి తో అతడిలో జాలి, దయా క్షమాగుణం నిద్ర మేల్కుంటాయి. అలా రియలైజ్ అయిన కథా నాయకుడు తన చిన్ననాటి స్నేహి తుడిని తలుచుకుంటాడు. నిజానికి ఇది తాత్విక కథ. ఈ కథ రాయా లంటే ఎంతో సుదీర్ఘమైన జీవిత అనుభవం ఉండాలి.నిత్యజీవిత తాత్కాలిక అవసరాల కూపం లో చిక్కుకుపోవడం కాదు. మట్టిని,మనిషిని రెండు చేతు లతో ఆలింగనం చేసుకోవా లి. అలాంటి విశాల అవగా హనను అందించే కథ ఇది. బంధాలను తెంచు కోవడం క్షణాల మీది పని. వాటిని నిలబెట్టుకో వడం ఆశామాషీ కాదు. ఆ కథ చదివిన తరు వాత పాఠకుడు కులమతాలకు అతీతంగా తనలో నిద్రాణమై ఉన్న మానవత్వంతో మేల్కొంటాడు. తన జీవిత పయనంలో తోడు నిలిచిన వారందరినీ తలచుకుంటాడు. ఒక కన్నీటి చుక్కను జారవిడుచుకుంటాడు. సున్ని త హృదయులు గుక్కపట్టి బోరున విలపిస్తారు.
ఇక స్కై కథల్లో ప్రధానమైన ఆకర్షణ తన దైన భాష. గడిచిన మూడు, నాలుగు దశాబ్దాల కాలంలో తెలంగాణ భాషకు సంబంధించిన సోయి విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. మన భాషలో మనం రాయాలి. అదే ప్రాంతేతర ఆధిపత్యానికి అసలైన నిరసన అనేది తెలంగా ణ సృజనకారుల అవగాహన. ఇక ముస్లింగా స్కైబాబ కథల్లో ప్రత్యేకమైన Diction ఉంది. అది కథకుడి కంఠస్వరానికి అదనపు అందాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతపు ఊరు తెలం గాణ భాషనైనా, పట్నం ముస్లిం గల్లీల పలుకు బడినైనా స్కై అవలీలగా పట్టుకున్నాడు. ఎన్ని వందల పదాలను తిరిగి బ్రతికించాడో ఆలోచి స్తే ఆశ్చర్యం కలుగుతుంది. తెలంగాణ భాషలో ఉండే మాధుర్యాన్ని ఎంజాయ్ చేయాలనుకునే వారికి స్కై కథలు ఒక దావత్‌ను ఇస్తాయి. విందుభోజనం పెడతాయి. ఈ కథల్లోని భాషమీద కూడా ప్రత్యేక అధ్యయనాలు, పరిశోధ నలు జరగాల్సి ఉంది. అంతటి భాషా గాఢత కలిగిన కథలు ఇవి. ఇట్లా ఇతివృత్తానికి తగిన భాషతో పాటు స్పష్టమైన దృక్పథం స్కై కథలను మరోస్థాయిలో నిలబెట్టాయి. మిగిలిన ముస్లిం రచయితలకు, స్కైకి ఇదే ప్రధానమైన తేడాగా కనిపిస్తుంది. మిగిలిన ముస్లిం రచయితలు కొన్ని సార్లు ఉదార స్వభావంతో జనరల్ కథలు కూ డా రాస్తారు. స్కై మాత్రం ముస్లిం సమాజపు గొంతుకగా మారి నిక్కచ్చిగా రాస్తాడు. ఇప్పుడు మాట్లాడండి అని చర్చను లేవదీస్తాడు. మళ యాళం కథల్లో వైకోమ్ మహమ్మద్ బషీర్‌లా తెలుగు కథకు, తెలంగాణ కథకు తనవంతు కృషిని జోడిస్తాడు. అలాంటి స్కైబాబకు జాతీ య సమైక్యతా అవార్డు రావడం నిజమైన సం తోషం. అభినందనీయం.
ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజకీయాలను నిశి తంగా పరిశీలిస్తూ మరింత పదునెక్కాడు స్కై. సాహిత్యమే కాదు సామాజిక ఉద్యమాలు కీలక మనే అవగాహన అతడి మదిలో నిత్యం ఏదో ఒక అలజడి రేపుతూనే ఉంది. అలా వేవేల కుట్రల నడుమ ఒక వేకువ కోసం సాగిపోతున్న అజా పిలుపు స్కై. ఈ గొంతుక వేదికల మీదే కాదు, సమూహంలో కూడా నిరంతర చైతన్య కేతనమై నిలబడ్డది. ‘దునియాదారి’గా మారి దారి చూపిస్తున్నది. చరిత్ర అందరికీ దక్కదు, చరిత్రగా జీవించిన వారికే దక్కుతుంది.ముఖ్యం గా సామాజిక బాధ్యతతో జీవించినవారికే అది సొంతమవుతుంది. అలా చరిత్రగా జీవించి, చరిత్రలోనిలబడుతున్న స్కై చరిత్ర మూడు దశా బ్దాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యం నుండి తన కార్యచరణ మరింత విశాలమై పరివ్యాప్త మవుతుందనేది నిజం. ఈ సందర్భంగా ఎక్కడా ఆగిపోని చైతన్య ప్రవాహానికి నా సలామ్.
డా.పసునూరి రవీందర్
ఏప్రిల్ 18న ముస్లిం ఉద్యమకారుడు, కవి, కథకుడు స్కైబాబ పూనేలో జాతీయ సమైక్యతా అవార్డు అందుకుంటున్న సందర్భంగా..

