Saturday, November 15, 2025
Homeనేషనల్Teen Pregnancy: ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చిన 10వ తరగతి బాలిక.. తల్లిదండ్రులకు షాక్!

Teen Pregnancy: ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చిన 10వ తరగతి బాలిక.. తల్లిదండ్రులకు షాక్!

10th Grade Girl Gives Birth At Home: ఇంట్లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది 14 ఏళ్ల బాలిక. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురవ్వడం తల్లిదండ్రుల వంతయ్యింది. అప్పటి వరకు తమ కూతురు గర్భవతి అని వారికి తెలియకపోవడం విశేషం. కేరళలో జరిగింది ఈ అనూహ్య సంఘటన.

- Advertisement -

ఎనిమిది నెలల గర్బవతి..

కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక స్థానికంగా పదో తరగతి చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం ఇంట్లోనే ఆమె అకస్మాత్తుగా ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి చికిత్స అందించగా, ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రసవించిన సమయంలో బాలిక ఎనిమిది నెలల గర్బవతిగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

అయితే, ఈ ఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాలిక గర్భవతి అనే విషయం కుటుంబ సభ్యులకు ఇంతకాలం తెలియకపోవడం. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హోస్దుర్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. “బాలిక ప్రస్తుతం వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేదు. ఈ సంఘటనలో లైంగిక వేధింపులు ఏమైనా జరిగాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తాం” అని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad