Air India Pilots: ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గత నెలలో జరిగిన అత్యంత విచార ఘటన అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం మర్చిపోలేనిది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదం జరిగిన తరువాత ఎయిర్ ఇండియాలో సిక్ లీవ్స్ సంఖ్య పెరిగినట్లు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి లోక్ సభలో తెలిపారు.
ప్రమాదం సంభవించిన తరువాత మానసిక ఒత్తిడికి గురై కేవలం నాలుగు రోజుల్లో 112 మంది పైలట్లు సిక్ లీవ్ కి దరఖాస్తు చేసినట్టు తెలిపారు. వారిలో 51 మంది కమాండర్లు, 61 మంది ఫస్ట్ ఆఫీసర్లు ఉన్నారని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి లోక్‌సభకు వెల్లడించారు. దీంతో పాటు 2023లో విమానయాన సంస్థలకు ఇచ్చిన నోటీసుల గురించి ప్రస్తావించారు.
Readmore: https://teluguprabha.net/national-news/villagers-build-road-chhattisgarh-dhamtari-protest/
పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ ప్రస్తావించిన వాటిలో మొదటగా విమాన సిబ్బందికి వైద్య పరీక్షల సమయంలో మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేసే ప్రక్రియలు ఉండాలని అన్నారు. ఏవైనా సమస్యలు ఎదురైనపుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, విమానయాన సిబ్బంది, పైలట్ లకు తక్షణ సహాయం అందేలా పీర్ సపోర్ట్ గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు.
విమాన ప్రయాణాల్లో భద్రత, సిబ్బంది వ్యవహారాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. గత అర్ధ సంవత్సర కాలంలో భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి ఎయిర్ ఇండియా కి తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Readmore: https://teluguprabha.net/national-news/himachal-pradesh-floods-monsoon-fury-landslides-death-toll/
గత నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ కి బయల్దేరిన ఎయిర్ ఇండియా గాల్లోకి ఎగిరిన కాసేపటికే భవనంపై కుప్పకూలిపోవడంతో 260 మంది మృతి చెందారు. ఈ విమాన ప్రమాదం అనంతరం ఎయిర్ ఇండియాకు నాలుగు షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులలో భాగంగా క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి, శిక్షణా నిబంధనలు, నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి ఉల్లంఘనలు జరిగిన అంశాన్ని ఎయిర్ ఇండియా అంగీకరించినట్టు అధికార వర్గాల సమాచారం.


