Viral News: మందు బాటిల్‌లో లేఖ ఏంటి అనుకుంటున్నారా? లేకపోతే.. ఎవరో అప్పట్లో తాగేసి బాటిల్‌లో కాగితం ముక్క పడేసిఉంటారులే అనుకుంటున్నారు కావచ్చు..? కానీ ఈ లేఖకు పెద్ద చరిత్రే ఉంది. ఇప్పటి కాలం నాటి లేఖ కాదు.. ఏకంగా 135ఏళ్ల నాటి లేఖ. అంటే దానిలో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సకత ప్రతీఒక్కరిలో ఉంటుంది. ఇంతకీ అదెక్కడ దొరికిందో తెలిస్తే ఆ లేఖను చదివేందుకు ఇంకా ఉత్సాహం చూపుతారు. స్కాట్లాండ్‌లోని ఓ నివాసంలో మరమ్మతుల సందర్భంగా తవ్వకాలు జరిపిన సమయంలో 135ఏళ్ల నాటి లేఖ బయటపడింది. విస్కీ బాటిల్‌లో భద్రపర్చిన ఈ లేఖ విక్టోరియన్ కాలం నాటిదిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
పురాతనకాలం నాటి ఇంట్లో మరమ్మతులు చేస్తున్నారు. పీటర్ అలెన్ అనే 50ఏళ్ల వ్యక్ ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పైపులు సరిచేసేందుకు ఇంట్లో ఓ గుంత తీయాల్సి వచ్చింది. ఆ గుంత తీసే క్రమంలో పురాతన విస్కీబాటిల్, అందులో లేఖ కనిపించింది. పీటర్ దీనిని తీసుకెళ్లి ఇంటి యాజమాని ఎలిద్ స్టింప్సన్‌కు ఇచ్చాడు. ఆమె దానిలోని లేఖను తీసేందుకు ప్రయత్నించింది. కానీ అది ఎంతకీరాకపోవటంతో ఆ సీసాను పగులగొట్టి అందులో ఉన్న లేఖను బయటకుతీసి చదివింది. అప్పుడుకానీ తెలియలేదు.. ఆ లేఖ 1887 అక్టోబర్ 6 నాటిదని. జేమ్స్ రిట్చీ, జాన్ గ్రీవ్ అనే వ్యక్తుల సంతకాలు ఆ లేఖలో ఉన్నాయి. అందులో రాసింది చదివితే విచిత్రంగా అనిపించింది.
“జేమ్స్ రిట్చీ , జాన్ గ్రీవ్ ఈ భవనాన్ని నిర్మించారు. కానీ వారు విస్కీని తాగలేదు. ఎవరైనా ఈ బాటిల్‌ను కనుగొంటే మన దుమ్ము రోడ్డుపై ఎగిరిపోతోందని అనుకోవచ్చు” అని ఉంది. ఆ తర్వాత ఎలిద్ స్టింప్సన్ ఆ బాటిల్‌తో పాటు అందులోని లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే.. ఆ పురాతన కాలంనాటి లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.