Rape incident in Assam: అస్సాంలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక అతి దారుణంగా అత్యాచారానికి గురై, ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులే ఆమెను గుర్తించలేని స్థితిలో ఇంట్లో శవమై కనిపించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని హైలాఖాండీ జిల్లాకు చెందిన ఓ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లింది. అయితే, తన బావతో గొడవ పడి తాను ఒక్కతే తిరిగి ఇంటికి వచ్చేసింది. వేడుక అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి తమ కుమార్తె అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి హతాశులయ్యారు. తమ కుమార్తె హత్యకు గురైందని, హత్యకు ముందు తమ బిడ్డపై అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Also Read: Fraud : సైబర్ సమరంలో డిజిటల్ దాడి.. గూగుల్, మెటాలపై హైదరాబాద్ పోలీసుల కఠిన వ్యూహం!
ప్రైవేట్ పార్ట్‌లో రాడ్డు చొప్పించి మరీ..
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. సదరు బాలిక తల, ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైందని, వ్యక్తిగత అవయవాల్లోకి రాడ్డు చొప్పించారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. శవపరీక్ష అనంతరం లైంగికదాడి జరిగిందా? లేదా? అనేది తెలుస్తుందని, హత్యకు గల కారణాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ప్రస్తుతం, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

