Saturday, November 15, 2025
Homeనేషనల్Maoists Killed: గుమ్లా జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

Maoists Killed: గుమ్లా జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

Maoists Killed in Gunfight with Security Forces: జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో భద్రతా బలగాలకు, నిషేధిత మావోయిస్ట్ గ్రూపుకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటన బుధవారం ఉదయం బిష్ణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెచ్కి గ్రామం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో జరిగింది. మృతులు ఝార్ఖండ్ జన ముక్తి పరిషద్ (JJMP) గ్రూపునకు చెందిన మావోయిస్టులుగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

ALSO READ: Maoists surrender: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. చత్తీస్‌ఘడ్‌లో 71 మంది లొంగుబాటు..!

గుమ్లా జిల్లా ఎస్పీ హరీస్ బిన్ జమాన్‌కు వచ్చిన పక్కా సమాచారం ఆధారంగా ఝార్ఖండ్ జాగ్వార్, గుమ్లా పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. ఉదయం 8 గంటల సమయంలో భద్రతా బలగాలు కెచ్కి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మృతులను లల్లూ లోహ్రా, సుజిత్ ఓరాన్ (లోహర్దగా జిల్లా వాసులు), ఛోటు ఓరాన్ (లతేహర్ జిల్లా వాసి)గా పోలీసులు గుర్తించారు.

ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. వాటిలో ఒక ఏకే-56 రైఫిల్, ఒక ఇన్‌సాస్ రైఫిల్, ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఇంకా కొన్ని మందుగుండు సామగ్రి ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ALSO READ: Union Cabinet: బిహార్‌కు కేంద్రం వరాల జల్లు.. కొత్త రైల్వే ప్రాజెక్టులతో పాటు మెడికల్‌ సీట్ల పెంపు

ఈ విజయంపై జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా మాట్లాడుతూ, “ఈ ఏడాది ఇప్పటివరకు 32 మంది మావోయిస్టులను హతమార్చాం. 2026 నాటికి రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడమే మా లక్ష్యం” అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, “మావోయిస్టులు లొంగిపోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని” హెచ్చరించారు. ఈ ఎన్‌కౌంటర్‌తో JJMP సంస్థ దాదాపు అంతమైందని పోలీసులు వెల్లడించారు. ఈ గ్రూపునకు చెందిన తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు అరెస్టయ్యారు, తొమ్మిది మంది లొంగిపోయారు. మిగిలిన ఇద్దరు, ముగ్గురు సభ్యులను కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

ALSO READ: Ladakh Protest: లద్దాఖ్‌లో భగ్గుమన్న ఆందోళనలు.. రాష్ట్ర హోదా పోరాటంలో నలుగురి మృతి, లేహ్‌లో కర్ఫ్యూ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad