Saturday, November 15, 2025
Homeనేషనల్Madrassa: తనిఖీకి వెళ్లిన అధికారులకు షాక్.. అక్రమ మదర్సా టాయిలెట్‌లో దాక్కున్న 40 మంది బాలికలు!

Madrassa: తనిఖీకి వెళ్లిన అధికారులకు షాక్.. అక్రమ మదర్సా టాయిలెట్‌లో దాక్కున్న 40 మంది బాలికలు!

Girls Locked Inside Toilet of Unregistered Madrassa: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. అక్రమంగా నడుస్తున్న ఒక మదర్సాలో తనిఖీ కోసం వెళ్లిన అధికారులకు ఊహించని షాక్ తగిలింది. సుమారు 9 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల 40 మంది బాలికలు మదర్సా భవనం పైన ఉన్న టాయిలెట్‌లో దాక్కుని ఉండగా పోలీసులు, అధికారులు గుర్తించారు.

- Advertisement -

ఎక్కడ జరిగింది?

పాయగ్‌పూర్ తహసీల్‌లోని పహల్వారా గ్రామంలో మూడు అంతస్తుల భవనంలో అక్రమంగా ఒక మదర్సా నడుస్తున్నట్లు జిల్లా పరిపాలనా యంత్రాంగానికి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో పాయగ్‌పూర్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) అశ్విని కుమార్ పాండే బుధవారం తనిఖీ కోసం తన బృందంతో అక్కడికి వెళ్లారు.

ఎస్డీఎం పాండే తెలిపిన వివరాల ప్రకారం, “మేము తనిఖీకి వెళ్లినప్పుడు, మదర్సా నిర్వాహకులు మొదట మమ్మల్ని పై అంతస్తులోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల సహకారంతో మేము లోపలికి ప్రవేశించగా, టెర్రస్‌పై ఉన్న టాయిలెట్ గదికి తాళం వేసి ఉంది.” మహిళా పోలీసుల సమక్షంలో ఆ తాళం తీసి చూడగా, దాదాపు 40 మంది బాలికలు భయంతో వణికిపోతూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. వారు భయపడినట్లుగా కనిపించారని, ఏమీ సరిగ్గా మాట్లాడలేకపోయారని ఎస్డీఎం తెలిపారు.

ALSO READ: Police Harassment: ఏపీలో దారుణం.. బాధితురాలిపై పోలీసుల లైంగిక దాడి!

రిజిస్ట్రేషన్ లేని మదర్సా

ఈ సంస్థ రిజిస్ట్రేషన్, చట్టబద్ధతను పరిశీలించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహ్మద్ ఖాలిద్‌ను ఎస్డీఎం ఆదేశించారు. ఖాలిద్ చెప్పినదాని ప్రకారం, ఈ మదర్సా సుమారు మూడు సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తోంది. గత 2023 సర్వే సమయంలో 495 రిజిస్ట్రేషన్ లేని మదర్సాలను గుర్తించినప్పటికీ, ఇది అధికారుల దృష్టి నుంచి తప్పించుకున్నట్లు కనిపిస్తోంది.

అయితే, బాలికలు టాయిలెట్‌లో ఎందుకు దాక్కున్నారని ప్రశ్నించగా, మదర్సా టీచర్ తక్సీమ్ ఫాతిమా స్పందిస్తూ… అధికారులు వచ్చారనే గందరగోళంలో భయపడిన బాలికలు లోపలికి వెళ్లి తాళం వేసుకున్నారని చెప్పినట్లు ఖాలిద్ తెలిపారు.

కేసు నమోదు కాలేదు, మూసివేతకు ఆదేశాలు

ప్రస్తుతం మదర్సా రికార్డులను పరిశీలిస్తున్నారు. దీనిని వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాలికలందరినీ సురక్షితంగా వారి ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేయగా, వారందరూ సురక్షితంగా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిటీ) రమానంద్ ప్రసాద్ కుష్వాహా మాట్లాడుతూ… తల్లిదండ్రులు, ఎస్డీఎం లేదా మైనారిటీ సంక్షేమ అధికారి నుండి తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ALSO READ: Minors Rape: బతుకమ్మ ఆడేందుకు వస్తే.. ప్రేమ పేరుతో ముగ్గురు బాలికలపై అత్యాచారం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad