Deaths in Karnataka: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. నదిలో వేటకు దిగి ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. 8 మంది మృతదేహాలను వెలికితీశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: https://teluguprabha.net/telangana/ktr-ghmc-election-sketch/
ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కల సమీపంలో తత్తెహక్కలు నదిలో ఆదివారం వేటకు దిగి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది గల్లంతవ్వగా, ఇప్పటివరకు ఎనిమిది మంది మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు ప్రక్రియ తెలియాల్సి ఉంది.

