8th Pay Commission Big Date: 8వ వేతన సంఘం ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో చాలా సందేహాలు, ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఎప్పుడు అమల్లోకి వస్తుంది, డీఏ ఉంటుందా లేదా, బడ్జెట్ కేటాయిస్తారా లేదా, పెన్షనర్లకు వర్తిస్తుందా వంటి ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సాక్షిగా కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
8వ వేతన సంఘం ఏర్పాటు 8th Pay Commission Big Update, టీవోఆర్ మంజూరు, నోటిఫికేషన్ విడుదల తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో చాలా సందేహాలు నెలకొన్నాయి. దీనికి కారణం 8వ వేతన సంఘం టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో స్పష్టత లేకపోవడమే. 8వ వేతన సంఘం సిఫార్సులు పెన్షనర్లకు వర్తిస్తాయా లేవా, డీఏ విలీనం చేస్తారా లేదా, డీఏ పెంపు కొనసాగుతుందా, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే ప్రశ్నలు తరచూ విన్పిస్తున్నాయి. వీటిలో పెన్షనర్లకు వర్తింపు, డీఏ విలీనం, డీఏ పెంపు కొనసాగింపు అంశాల్లో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్ధిక శాఖ Union Finance Ministry వివరణ ఇచ్చేసింది. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి పార్లమెంట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 8వ వేతన సంఘం సిఫార్సుల అమలు, బడ్జెట్ కేటాయింపు అంశంపై పార్లమెంట్‌లో ప్రస్తావన వచ్చింది.
పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నలేంటి
నలుగురు పార్లమెంట్ సభ్యులు ఎన్‌కే ప్రేమచంద్రన్, తిరు తంగ తమిళసెల్వన్, పి గణపతి, ధర్మేంద్ర యాదవ్‌లు కేంద్ర ఆర్ధిక శాఖకు రెండు కీలకమైన ప్రశ్నలు అడిగారు. 8వ వేతన సంఘం అమలు ఎప్పుడనే విషయం టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో లేకపోవడంతో ఇదే అంశాన్ని ప్రశ్నించారు. ఇక 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేసేందుకు బడ్జెట్ కేటాయింపు ఉంటుందా లేదా అనడిగారు. ఈ రెండు ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి Union Finance Minister for State Pankaj Chowdary సమాధానమిచ్చారు. 8వ వేతన సంఘం ఎప్పుడు అమలు చేస్తారనేది కేంద్ర ప్రభుత్వం Central Government నిర్ణయిస్తుందంటూ ఒక్క ముక్కలో తేల్చేశారు. అంటే ఎప్పుడు అమలవుతుందో స్పష్టం చేయలేదు. ఇక రెండవది 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేసేందుకు బడ్జెట్ కేటాయింపు ఉంటుందన్నారు. అంటే 2026-27 కేంద్ర బడ్జెట్‌లో 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేసేందుకు తగినంత బడ్జెట్ కేటాయించనుందని అర్ధం.
అయితే ఎప్పటి నుంచి అమలవుతుందో చెప్పకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఉన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఓ రిపోర్ట్ ప్రకారం 8వ వేతన సంఘం 2028 జనవరి నుంచి అమల్లోకి రానుందని తెలుస్తోంది. టీఓఆర్‌లో Terms of Reference ప్రస్తావించకపోవడం, పార్లమెంట్‌లో అడిగినా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైంది.

