Students March 65 Km To Protest Teachers Shortage: పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ సుమారు 90 మంది విద్యార్థులు 65 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లోని పక్కే కేసాంగ్ జిల్లాలో జరిగింది. న్యాంగ్‌నో గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV) విద్యార్థినులు ఈ నిరసన చేపట్టారు.
ALSO READ: Tejashwi Yadav FIR : చీటింగ్ కేసు.. మహిళ ఫిర్యాదుతో తేజస్వీ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదు
ఆదివారం సాయంత్రం న్యాంగ్‌నో గ్రామంలోని పాఠశాల నుంచి బయలుదేరిన విద్యార్థులు రాత్రంతా నడిచి ఉదయం జిల్లా కేంద్రం లెమ్మీకి చేరుకున్నారు. ప్లకార్డులు చేతబట్టి, నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. “టీచర్లు లేని పాఠశాల కేవలం ఒక భవనం మాత్రమే” అని రాసి ఉన్న ప్లకార్డులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పాదయాత్రకు 11వ తరగతి, 12వ తరగతి విద్యార్థులు నాయకత్వం వహించారు.
ముఖ్యంగా జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులకు టీచర్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని పాఠశాల యాజమాన్యం, ఉన్నత విద్యాశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఈ నిరసన తప్పలేదని విద్యార్థినులు పేర్కొన్నారు.
ALSO READ: Civil Service Officer : లంచం కేసులో సివిల్ సర్వీస్ అధికారిణి అరెస్ట్..ఇంట్లో నోట్ల కట్టలు
అయితే, విద్యార్థుల నిరసనపై పాఠశాల హెడ్ మిస్ట్రెస్ స్పందించారు. జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులకు టీచర్ల కొరత ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ మిగిలిన సబ్జెక్టులకు తగినంత మంది టీచర్లు ఉన్నారని, హాఫ్-ఇయర్లీ పరీక్షలకు సిలబస్ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. అలాగే, విద్యార్థులు ఈ పాదయాత్ర గురించి హాస్టల్ వార్డెన్‌కు లేదా పాఠశాల అధికారులకు సమాచారం ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు.
ALSO READ: Madhya Pradesh Sidhi Murder : బేస్‌బాల్ బ్యాట్‌తో మహిళా హెడ్ కానిస్టేబుల్ ను కొట్టి చంపిన భర్త


