ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal) భారీ షాక్ తగిలింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హస్తిన రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కాం(Liquor scam case)లో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) అనుమతి ఇచ్చారు. ఈమేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈనెల 5న లెఫ్టెనెంట్ గవర్నర్‌ను ఈడీ అధికారులు అనుమతులు కోరారు.
సీఆర్‌పీసీ చట్టం ప్రకారం మనీలాండరింగ్‌కు సంబంధించి ప్రజాప్రతినిధులను విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇదిలా ఉంటే ఈ కేసులో తనపై విచారణ ప్రక్రియను నిలిపివేయాలని కేజ్రీవాల్ అభ్యర్థనను ఇటీవల ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లిక్కర్ స్కాంలో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా.. సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని రోజులు బెయిల్‌పై బయటకు వచ్చి ప్రచారం నిర్వహించిన విషయం విధితమే.