Saturday, November 15, 2025
Homeనేషనల్Father daughter love: తండ్రి ప్రేమంటే ఇలానే ఉంటది.. రూపాయ్ రూపాయ్ దాటి కూతురి కోసం...

Father daughter love: తండ్రి ప్రేమంటే ఇలానే ఉంటది.. రూపాయ్ రూపాయ్ దాటి కూతురి కోసం స్కూటీ..

Bengal tea seller: పశ్చిమ బెంగాల్ వెస్ట్ మిద్నాపూర్‌లోని ఓ చిన్న టూవీలర్ షోరూమ్‌లో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రామీణ బెంగాల్‌కు చెందిన ఒక టీ వ్యాపారి బచ్చు చౌధురి తన కూతురికి అపురూపమైన కానుక ఇచ్చాడు. తన కుమార్తె సుష్మా కోసం ఒక స్కూటర్ కొనేందుకు దాదాపు నాలుగేళ్ల పాటు రూపాయి రూపాయి కూడబెట్టాడు. దీంతో స్కూటీ కొనటానికి వెళ్లినప్పుడు నాణేలను ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకెళ్లాడు.

- Advertisement -

షోరూమ్ యజమానులకు రూ.69వేలను నాణేల రూపంలో మిగిన రూ.31వేలు నోట్లుగా చెల్లించాడు. మౌలా గ్రామానికి చెందిన బచ్చు చౌధురి డబ్బును “లక్ష్మీర్ భాండ్స్” అనే సంప్రదాయ పిగ్గీ బ్యాంకుల్లో దాచిపెట్టాడు. తన చిన్న చాయ్ దుకాణం వద్ద కస్టమర్లు ఇచ్చిన చిల్లరని జాగ్రత్తగా సేకరించడం రోజువారీ అలవాటుగా మార్చుకున్నాడు. “నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు.. మనకు స్కూటర్ కొనగలిగే స్థోమత లేదు. కానీ ఒకరోజు ఆయన అకస్మాత్తుగా ‘రా.. స్కూటర్ కొనుక్కుందాం’ అని చెప్పిన విషయాన్ను సుష్మా పంచుకున్నారు. తండ్రి చెప్పిన మాటలు ఒక్క నిమిషం పాటు అసలు నిజమేనా అని నమ్మలేకపోయినట్లు నవ్వుతూ చెప్పింది.

షోరూమ్‌కి చేరుకున్న బచ్చు మొదట ధర అడిగి.. తర్వాత ఈఎంఐలో తీసుకోవచ్చా అని తెలుసుకున్నారు. ఆపై సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసే ప్రశ్న వేశారు. అదే డబ్బును నాణేలతో చెల్లించవచ్చా? అని. సిబ్బంది అంగీకరించగానే, ఆయన ప్లాస్టిక్ డబ్బాలను తీసి లెక్కించటం స్టార్ట్ చేశాడు. క్షణాల్లోనే షోరూమ్ ఫ్లోర్ పై నాణేలు మెరుస్తూ కనిపించాయి. అక్కడ రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, చివరికి 10 రూపాయల నాణేలు అతని కష్టం, అలాగే కూతురి కోరిక తీర్చాలనే ఆశయానికి నిదర్శనంగా నిలిచాయి.

ఆ పేద తండ్రి ఇచ్చిన నాణేలను లెక్కించటానికి రెండు గంటల పాటు 8 మంది సిబ్బంది కష్టపడాల్సి వచ్చిందని సేల్స్ అగ్జిక్యూటివ్ వెల్లడించారు. చివరికి ప్రక్రియ పూర్తి చేసి సుష్మాకు తాళాలు అప్పగించినట్లు చెప్పారు. ఆ క్షణం తండ్రి ముఖంలో మెరిసిన సంతోషం, కూతురు కన్నుల్లో మెదిలిన ఆనందం షోరూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. తాను ఎప్పుడూ బైక్ కొనాలనుకున్నానని.. అయితే కూతురి కోసం స్కూటర్ కొని ఆమె కల నెరవేర్చటం సంతోషంగా ఉందని బచ్చు అన్నారు. ఇందుకోసం ఆమె కూడా రూ.10వేలు దాచుకున్నట్లు చెప్పాడు.

చాయ్ కప్పులలో మిగిలిన చిల్లరతో మొదలైన ఆయన ప్రయాణం.. తండ్రి ప్రేమకు ప్రతీకగా నిలిచిపోయింది. బచ్చు చౌధురి చేసిన ఈ సర్ప్రైజ్, పశ్చిమ బెంగాల్ గ్రామీణ జీవితంలో కూడా కలలను సాధించే శక్తి ఉండదనే భావనను మళ్లీ గుర్తు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad