A new equation on the screen of Tamilnadu: తమిళ రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను మించి గంట గంటకూ మారుతున్నాయి. తమిళనాట అసలేం జరుగుతోందనే విషయంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. విజయ్ సీఎం అవుతారా? లేదా? అనే విషయంపై అంతా చర్చించుకుంటుండగా.. ఇప్పుడు ఓ ఊహించని వార్త లీకైంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు, రజినీకాంత్ ఎన్నికల్లో పోటీనే చేయలేదు.. ఆయన సీఎం ఎలా అవుతారు? అనేకదా మీ సందేహం. అవును.. మీరు చదువుతున్నది నిజమే.. తమిళనాడు సీఎంగా రజనీకాంత్‌ను చేయాలనే ప్రతిపాదన వచ్చిందంట. దీనిపై డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు జోరుగా చర్చిస్తున్నట్లు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. విజయ్‌ని సీఎం కాకుండా అడ్డుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ద్రవిడ అస్థిత్వం నినాదంతో ఈ రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్లు అధికారాన్ని పంచుకోనున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అని అన్నాడీఎంకే సంకేతాలు ఇచ్చేసింది.. డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
Also Read: https://teluguprabha.net/national-news/vck-party-key-comments-on-support-to-vijay-tvk/
స్టాలిన్ ఇంటికి వెళ్లిన రజినీకాంత్..
ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న డీఎంకే నుంచి స్టాలిన్‌ను కాకుండా రజినీకాంత్‌ను సీఎం చేయాలనే ఆలోచనలో ఉందంట డీఎంకే పార్టీ. ఈ ప్రతిపాదనకు అన్నాడీఎంకే పార్టీ కూడా ఓకే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, అన్నాడీఎంకే చీఫ్, మాజీ సీఎం పళనిస్వామిని స్పీకర్ చేయాలనే ప్రతిపాదనలతో కొత్త ఈక్వేషన్స్ నడుస్తున్నాయంట. డీఎంకే సీనియర్ నేత వేలు రజినీకాంత్ ఇంటికి వెళ్లి.. చాలా సమయం ఇదే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ ఇంట్లో వేలు 2 గంటలకు పైగా చర్చలు జరపడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆ తర్వాత రజినీకాంత్ ఇంటి నుంచి నేరుగా స్టాలిన్ దగ్గరకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. నిన్నటికి నిన్న అన్నాడీఎంకే నేత కొన్ని వ్యాఖ్యలు చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/tvk-vijay-tweet-on-inter-results/
ఎవరూ ఊహించని నిర్ణయాలు జరగొచ్చు..
ఎవరూ ఊహించని.. ఎవరూ ఊహించలేని నిర్ణయాలు జరగొచ్చు అని.. దానికి సంకేతం ఇదే అంటున్నారు. డీఎంకే పార్టీనే కాదు స్వయంగా ఎమ్మెల్యేగా ఓడిన స్టాలిన్ ఇంటికి వచ్చి రజనీకాంత్ పరామర్శించారు. అంటే, డీఎంకే పార్టీతో.. స్టాలిన్ తో ఆయనకున్న అనుబంధం ఏమిటనేది స్పష్టమవుతోంది. రజనీకాంత్‌ను సీఎం చేస్తే.. టీవీకే పార్టీ నుంచి వచ్చే ఒత్తిడులు, గొడవలను ఈజీగా ఎదుర్కోవచ్చని.. సినీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందనే ఉద్దేశంలో స్టాలిన్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

