Homeనేషనల్Supreme Court: సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి!

Supreme Court: సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి!

- Advertisement -

Supreme Court: సుప్రీంకోర్టుకు మరో ఐదుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ఇందులో తెలుగు వ్యక్తి, మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పి.వి. సంజయ్‌ కుమార్‌ పేరు కూడా ఉంది. సుప్రీంకోర్టుకు తెలుగు వ్యక్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ సహా ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేయాలనీ కొలీజియం నిర్ణయించింది.

ఇందులో మణిపూర్ హైకోర్టు సీజే జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, రాజస్థాన్ హైకోర్టు సీజే జస్టిస్ పంకజ్ మిట్టల్, పాట్నా హైకోర్టు సీజే సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రాల పేర్లను సిఫార్సు చేయాలని కొలీజియం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News