Aadhaar Download through WhatsApp: మన నిత్య జీవితంలో ఆధార్ కార్డుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్డు ప్రతి భారతీయుడికి ఉండాల్సిన ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. భారతీయ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ పథకాలు పొందడానికి, బ్యాంకింగ్ సేవలకు ఆధార్ ఉండాల్సిందే. చాలా మంది కార్డును ఎప్పుడూ వెంట తీసుకెళ్లడం కష్టంగా భావిస్తుంటారు. అలాగే కొన్నిసార్లు డాక్యుమెంట్స్ కోసం డిజిలాకర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సందర్భాల్లో వాట్సాప్ ద్వారా ఆధార్‌ను ఈజీగా పొందవచ్చు. కొత్తగా ఎలాంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త సదుపాయం ద్వారా కేవలం వాట్సాప్ ద్వారానే ఆధార్ కార్డు పీడీఎఫ్‌ను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Also Read: https://teluguprabha.net/gallery/alia-bhatt-hot-photoshoot/
వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ విధానం..
1. ముందుగా MyGov హెల్ప్ డెస్క్ నంబర్ +91-9013151515 ను మీ కాంటాక్టు లిస్టులో సేవ్ చేసుకోండి.
2. అనంతరం వాట్సాప్ ఓపెన్ చేసి మైగవ్ హెల్ప్ డెస్క్‌కు “హాయ్” లేదా “నమస్తే” అని మెసేజ్ చేయండి.
3. మెనూ ఆప్షన్లలో డిజీ లాకర్ సర్వీస్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి మీ అకౌంట్‌ను ధృవీకరించండి.
4. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి అథెంటికేషన్‌పై క్లిక్ చేయండి.
5. ధృవీకరణ పూర్తయ్యాక, డాక్యుమెంట్ల జాబితా నుండి ఆధార్‌ను సెలక్ట్ చేసుకోండి. మీ ఆధార్ కార్డు పీడీఎఫ్ ఫార్మాట్‌లో వాట్సాప్‌లోనే వస్తుంది.
6. ఆ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.
సులభంగా, వేగంగా డౌన్‌లోడ్..
ఈ సర్వీస్‌ను ఉపయోగించుకోవాలంటే మీ ఆధార్ డిజీ లాకర్‌తో లింక్ అయి ఉండాలి. లేకపోతే, డిజీ లాకర్ వెబ్‌సైట్ ద్వారా మీ వివరాలను నమోదు చేసుకోవాలి. అయితే, ఈ వాట్సాప్ చాట్ బాట్ ద్వారా ఒకేసారి ఒక డాక్యుమెంట్‌ను మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా కోట్లాది మంది భారతీయులకు తమ ఆధార్, ఇతర డాక్యుమెంట్లను సులభంగా, వేగంగా పొందవచ్చని యూఐడీఏఐ పేర్కొంది. అయితే, వాట్సాప్ ద్వారా ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా సురక్షితమైన పద్ధతి. ఈ చాట్‌బాట్ నేరుగా డిజిలాకర్‌కు కనెక్ట్ అవుతుంది. అందుకే అన్ని డాక్యుమెంట్లు ఎన్‌క్రిప్టెడ్, సెక్యూర్‌గా ఉంటాయి. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. అంతేకాకుండా ఆధార్‌తో పాటు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్లనూ ఇదే పద్ధతిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ముఖ్యంగా అత్యవసర సమయాల్లో డాక్యుమెంట్లు కావాల్సినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇది డిజిటల్ ఇండియా మిషన్‌లో కీలక అడుగుగా చెప్పవచ్చు.


