Aadhaar Update Charges Hiked: ఆధార్ అప్‌డేట్‌నకు సంబంధించి UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ అప్‌డేట్ సేవలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి రుసుములను పెంచింది. ఇకపై మీ పేరు, చిరునామాతో పాటు వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సవరించిన ధరలు సెప్టెంబర్ 30వ తేదీ 2028 వరకు అమలులో ఉంటాయని యూఐడీఏఐ తెలిపింది. అయితే చిన్నపిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్లు మాత్రం ఉచితంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ఆధార్ అప్‌డేట్ ఫీజుల వివరాలివే..
1. డెమోగ్రాఫిక్ అప్‌డేట్లు: పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ వంటి వివరాలను విడిగా అప్‌డేట్ చేస్తే.. గతంలో రూ. 50 చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు రూ. 25 పెంచారు. ఈ వివరాలను బయోమెట్రిక్ అప్‌డేట్‌తో కలిపి చేస్తే.. అదనంగా ఎలాంటి రుసుము వసూలు చేయరు.
Also Read: https://teluguprabha.net/cinema-news/rag-mayuri-vimal-krishna-anumana-pakshi-movie/
2. బయోమెట్రిక్ అప్‌డేట్లు: వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్ లేదా ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాలను మార్చడానికి ఇప్పుడు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది.
- డాక్యుమెంట్ అప్‌డేట్లు: గుర్తింపు లేదా చిరునామా ధృవీకరణ పత్రాలను సమర్పించే ప్రక్రియలో స్వల్ప మార్పులు చేశారు. ‘myAadhaar’ పోర్టల్ ద్వారా ఈ డాక్యుమెంట్లను అప్‌డేట్ చేస్తే.. 2026 జూన్ 14వ తేదీ వరకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే ఆధార్ నమోదు కేంద్రాల్లో డాక్యుమెంట్ అప్‌డేట్ చేస్తే.. గతంలో ఉన్న రూ. 50 ఫీజుకు బదులు రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.
4. ఆధార్ ప్రింటౌట్ ఛార్జీలు..
Also Read: https://teluguprabha.net/crime-news/devaragattu-banni-utsavam-stick-fight-two-dead-100-injured/
eKYC లేదా ఇతర సాధనాల ద్వారా ఆధార్ ప్రింటౌట్ తీసుకోవడానికి మొదటి దశలో రూ.40 వసూలు చేస్తారు. రెండో దశ అంటే 2028 అక్టోబర్ నుంచి ఈ ఛార్జీలు రూ.50కి పెంచనున్నారు.


