Thursday, January 15, 2026
Homeనేషనల్Aadhar Card: ఆధార్ కార్డు కొత్త రూల్స్.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి!

Aadhar Card: ఆధార్ కార్డు కొత్త రూల్స్.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి!

Aadhar Card Update: మీకు కొత్త ఆధార్ కార్డు కావాలన్నా లేదా పాత ఆధార్‌లో పేరు, చిరునామా లేదా ఇతర సమాచారాన్ని మార్చాలనుకున్నా.. ఇప్పుడు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. 2025-26 ఏడాదికి ఆధార్ కార్డు అప్‌డేట్ చేయడానికి అవసరమైన పత్రాల కొత్త లిస్టును యూఐడీఏఐ తాజాగా విడుదల చేసింది.
అయితే వీటిలో కొన్ని వెసులుబాటు ఇచ్చింది యూఐడీఏఐ. పొరపాటున ఒకే పేరు మీద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ కార్డులు ఇచ్చినట్లయితే.. వాటిలో మొదటగా ఇచ్చినదే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. అయితే మిగిలిన ఆధార్ నంబర్లు రద్దు అవ్వడానికి కొన్ని డాక్యుమెంట్స్ కావాల్సి ఉంది. అవేంటి అంటే..
1) స్వీయ ధృవీకరణ పత్రం (ఐడెంటిటీ ఫ్రూఫ్)
పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఎలాంటి ఐడెంటిటీ అయినా సరిపోతుంది.
2) అడ్రస్ ప్రూఫ్:
విద్యుత్, వాటర్, గ్యాస్, ల్యాండ్ లైన్ బిల్లు వంటివి సరిపోతాయి.

- Advertisement -

3) బర్త్ సర్టిఫికేట్:

10th క్లాస్ మార్క్స్ లిస్టు, పాస్‌పోర్ట్, మీ పుట్టిన తేదీ రాసిన ఇతర డాక్యుమెంట్ సరిపోతాయి.

4) కార్డు దారునితో సంబంధానికి రుజువు (అవసరమైతే మాత్రమే ఇవ్వాలి).

ఈ కొత్త నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?

యూఏఐడీఐ విడుదల చేసిన కొత్త నిబంధనలు భారతీయ పౌరులతో పాటు ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), 5 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు సహా ఎక్కువ కాలం వీసాలపై భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు.. దగ్గర్లోని కార్యాలయంలో డాక్యుమెంట్ జత చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 14, 2026 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News