Sunday, December 8, 2024
Homeనేషనల్MCD Polls: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ‘ఆప్’ ఘన విజయం.. ప్రతిపక్షానికే పరిమితం కానున్న బీజేపీ

MCD Polls: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ‘ఆప్’ ఘన విజయం.. ప్రతిపక్షానికే పరిమితం కానున్న బీజేపీ

MCD Polls: ఢిల్లీ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. తొలిసారిగా ఢిల్లీ మున్సిపాలిటీలో అధికారం చేపట్టనుంది. దీంతో 15 ఏళ్లుగా సాగుతున్న బీజేపీ ఆధిపత్యానికి చెక్ పడ్డట్లైంది. మొత్తం 250 సీట్లున్న ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ ఇప్పటికే 134 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది.
అధికారం చేపట్టేందుకు 126 సీట్లు ఉండాలి. ఇంతకాలం అక్కడ అధికారంలో కొనసాగిన బీజేపీ ఇకపై ప్రతిపక్షానికే పరిమితం కానుంది. బీజేపీ ఇప్పటివరకు 104 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు మూడు సీట్లు గెలుచుకున్నారు. తుది ఫలితం మరికొద్దిసేపట్లో వెల్లడవుతుంది. ఈ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ మన్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ ఆధిపత్యానికి సీఎం కేజ్రీవాల్ చెక్ పెడితే, తాజా ఎన్నికల ద్వారా 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి చెక్ పడిందని భగవంత్ మన్ వ్యాఖ్యానించారు. ఈ విజయం నేపథ్యంలో ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో ఆప్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News