Homeనేషనల్Legislation : సెల్ఫీ సవ్వడిపై సెటైర్ల దడి... ప్రధాని మోదీ వీడియోపై అభిజీత్ దీప్కే...

Legislation : సెల్ఫీ సవ్వడిపై సెటైర్ల దడి… ప్రధాని మోదీ వీడియోపై అభిజీత్ దీప్కే వ్యంగ్యాస్త్రాలు

Anti-paper leak bill PM Modi selfie video satire : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన వేళ, రాజకీయ వేదికపై సంచలనాత్మక వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పార్లమెంట్‌లో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026’ ఆమోదం పొందిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. 

- Advertisement -

సెల్ఫీ వీడియో ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పారు? : ప్రశ్నపత్రాల లీకేజీల నిరోధక సవరణ బిల్లు పార్లమెంట్‌లోని ఉభయ సభల ఆమోదం పొందిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ మోడ్‌లో చిత్రీకరించిన సందేశాన్ని పంచుకున్నారు. ఈ చట్టం ద్వారా దేశంలో పరీక్షల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా, నమ్మదగినదిగా మారుతుందని ప్రధాని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు అయిన యువత జీవితాలతో ఆటలాడుకునే పేపర్ మాఫియాను ఉపేక్షించేది లేదని, సాంకేతిక పరిజ్ఞానం, కఠిన చట్టాల ద్వారా వారి ఆట కట్టిస్తామని హెచ్చరించారు. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పేపర్ లీక్‌లు పెద్ద సవాలుగా మారాయని, ఈ రుగ్మతను రూపుమాపేందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

అభిజీత్ దీప్కే వ్యంగ్యాస్త్రాలు – ఇన్‌ఫ్లుయెన్సర్ రాజకీయాలు : ప్రధాని మోదీ సోషల్ మీడియా వ్యూహంపై సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే ఘాటుగా స్పందించారు. నిరుద్యోగిత, విద్యావ్యవస్థలోని లోపాలపై విమర్శలు గుప్పిస్తూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

చర్మానికి ఉన్న కాంతి దేశ భవిష్యత్తుకు లేదు’: ప్రధాని సెల్ఫీ  వీడియో కింద కామెంట్ చేస్తూ, “దేశ భవిష్యత్తు కన్నా మీ స్కిన్ చాలా షైనింగ్‌గా ఉంది” అని ఎద్దేవా చేశారు. ప్రధాని నిరంతరం వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి పూర్తిస్థాయి డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారితే మంచిదని, ఆ పదవిని దేశ సమస్యలను తీర్చే మరొకరికి అప్పగించాలని వ్యాఖ్యానించారు.

యాంటీ పేపర్ లీక్ బిల్లు, 2026 లోని ముఖ్యాంశాలు : విద్యార్థుల నిరసనలు, విపక్షాల ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో కఠినమైన నిబంధనలను చేర్చింది. పేపర్ లీకేజీలకు పాల్పడేవారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా విధించేలా నిబంధనలను కఠినతరం చేశారు. అక్రమాలపై నిర్ణీత సమయంలోగా విచారణ పూర్తిచేయడం, రాష్ట్ర స్థాయిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. అయితే, తప్పు జరిగిన తర్వాత శిక్షించడం కంటే, అసలు లీకేజీలు జరగకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్మాణంలో సంస్కరణలు తేకపోవడంపై సీజేపీతో పాటు పలు విద్యార్థి సంఘాలు పెదవి విరుస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News