Actor Ajith Kumar loses his mother: కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి మోహిని మణి (85) ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె శనివారం ఉదయం స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న అజిత్‌కి ఈ విషయం తెలియగానే చెన్నై బయల్దేరారు. మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి కూడా మరణించడం.. ఇప్పుడు తల్లి మరణించడంతో అజిత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అజిత్ తల్లి మృతి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంతాపం తెలియజేస్తున్నారు.
Also read: Bus fire Accident: హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

