అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gautam adani)పై అమెరికాలోని న్యూయార్క్ లో లంచం, మోసం కేసు కావడంపై అదానీ గ్రూప్ స్పందించింది. అవన్నీ అసత్య ఆరోపణలన్ని తేల్చి చెప్పింది. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది.
- Advertisement -
మరోవైపు అదానీపై వచ్చిన ఆరోపణలపై జేపీసీ(JPC) వేయాలన్న కాంగ్రెస్ డిమండ్‌పై బీజేపీ కూడా స్పందించింది. నేర నిరూపణ జరిగేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు నిర్దోషులేనని కాంగ్రెస్ నేతలు షేర్ చేసిన పత్రాల్లోనే రాసు ఉండటం చూడలేదా అని బీజేపీ నేత అమిత్ మాలవీయ కౌంటర్ ఇచ్చారు. అందులో ఆరోపించిన రాష్ట్రాలన్నీ కాంగ్రెస్, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలేనని పేర్కొన్నారు. అందుచేత ముందు మీరు తీసుకున్న లంచాలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.